ఇండియ‌న్ సినిమా స్క్రీన్ మీద గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా చారిత్రక నేపథ్యమున్న బయోపిక్‌లను తెరకెక్కించాడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. గ‌త నాలుగైదేళ్లుగా ఈ బ‌యోపిక్‌లు, హిస్టారిక‌ల్ నేప‌థ్యం ఉన్న సినిమాలు ఎక్కువుగా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ సైతం ఓ చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర సుబేదార్‌గా పనిచేసిన ‘తానాజీ’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తానాజీ’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఈ సినిమా ఏకంగా రు.300 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం కూడా సంచ‌ల‌న‌మైంది.



ఇక ఇప్పుడు అజ‌య్ దేవ‌గ‌న్ గతంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ పోషించిన ఓ పాత్ర‌లో న‌టించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర అంటే ఆయన పోషించిన చాణక్య చంద్రగుప్తుడి పాత్రను చేయడానికి రెడీ అవతున్నాడు.  ఈ త‌రంలో ఎవ‌రైనా రాజ‌కీయంగా మంచి ఎత్తులు వేస్తుంటే వాళ్ల‌ను చాణ‌క్య అంటూ పోలుస్తూ ఉంటారు. ఇక భారత దేశ చరిత్రలో నంద వంశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి వంశాన్ని ప‌త‌నం చేసి ఆ వంశ ప‌త‌న పునాదుల‌పై మౌర్య సామ్రాజ్య స్థాప‌న జ‌రిగింది.



ఈ చాణ‌క్యుడి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన చాణ‌క్య పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టిస్తున్నాడు. దాంతో పాటు చంద్రగుప్తుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. గొప్ప రాజ‌నీతి జ్ఞుడిగా పేరున్న చాణ‌క్యుడు కేవ‌లం భార‌త దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా పేరున్న అర్ధ‌శాస్త్ర పితామ‌హుడిగాను, రాజ‌నీతిజ్ఞుడిగాను పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను ‘బేబి’ ‘స్పెషల్ ఛబ్బీష్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ప్లాన్ సీ స్టూడియో వాళ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక చాణ‌క్య చంద్ర‌గుప్త‌తో పాటు చాలా యేళ్ల త‌ర్వాత వ‌చ్చిన సామ్రాట్ అశోక సినిమాలో సైతం ఎన్టీఆర్ చాణ‌క్య పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: