బోల్డ్ క్యారెక్టర్స్‌కి హాట్‌ సీన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ లాంటి బాలీవుడ్ నటి మహి గిల్ మనసు మార్చుకుంది. కెరీర్‌ లో ఎక్కువగా సెన్షుయస్‌ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇక మీద అలాంటి సీన్స్‌ చేయకూడదని నిర్ణయించుకుందట. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తనకొత్త సినిమా దూరదర్శన్ ప్రమోషన్‌ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది మహి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న దూరదర్శన్ సినిమాకు గగన్ పూరి దర్శకుడు. ఇప్పటికే గులాల్‌, దేవ్‌డీ, సాహిబ్ బీవీ ఔర్‌ గ్యాంగ్ స్టర్‌ లాంటి సినిమాల్లో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న మహి గిల్‌ ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించనుందట.

 

ఈ సందర్భంగా మహి మాట్లాడుతూ.. `గగన్‌ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఎక్కువగా సీరియస్‌, హాట్ రోల్స్‌ మాత్రమే. అందుకే ఆ తరహా సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా. ఇది కామెడీ సినిమా కాబట్టి నాకు పర్ఫామెన్స్‌కు చాలా స్కోప్‌ దక్కింది. ప్రస్తుతం నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ అవన్ని ఒకే తరహా పాత్రలు. అందుకే  ఆ సినిమాలకు నో చెపుతున్నా` అని చెప్పింది.

 

దూరదర్శన్ కథ విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల పాటు కోమాలో ఉన్న ఓ కుటుంబ పెద్ద మేల్కొంటుంది. అయితే ఆమె కోసం 80ల నాటి కాలాన్ని రీ క్రియేట్ చేసేందుకు ఆ కుటుంబం పాట్లను కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మహి గిల్‌ ఓ పంజాబీ యువతిగా కనిపించనుంది. ఈ సినిమాతో తాను బయట ఎలా ఉంటానో అలాగే తెర మీద కూడా కనిపిస్తానని చెపుతోంది మహి గిల్. మను రిషి, డాలీ అహ్లువాలియాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: