యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్... ఏ ఇమేజ్ లేకపోయినా సరే సినిమాల్లో నిలబడిన హీరో. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన హీరోల్లో ఒకడు. అల్లరి ప్రియుడు, అంకుశం, ఆహుతి వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ఆయనకు వచ్చిన ఇమేజ్ కూడా ఒకప్పుడు టాప్ లోనే ఉంది. తెలుగు స్పష్టంగా రాకపోయినా సరే ఆయనను స్టార్ హీరోని చేసారు కొందరు దర్శక నిర్మాతలు. సినిమాల మీద ఆసక్తి ఉండటంతో ఆయన దూసుకుపోయాడు. కాని ఒక వెలుగు వెలిగి ఆరిపోయారు రాజశేఖర్ అనేది వాస్తవం. 

 

అవును ఆయనకు ముందు వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవడం రాలేదు. ఆప్తుడు, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలతో ఆయన ఇమేజ్ మరింతగా పడిపోయింది. గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాలు కూడా ఆయన ఇమేజ్ ని దిగజార్చాయి. కెరీర్ లో నిలబడాల్సిన టైం లో కూడా ఆయన సరైన కథలను ఎంపిక చేసుకోలేకపోయారు. మంచి పరిచయాలు ఉన్నా సరే రాజశేఖర్ మాత్రం ఆ విధంగా అడుగులు వేయలేకపోయారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. రెండేళ్ళ క్రితం గరుడ వేగ అనే సినిమాతో రాజశేఖర్ ఫాం లోకి వచ్చారు. 

 

ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. మధ్యలో ఒక సినిమా వచ్చింది. మళ్ళీ ఆయన్ను ఫ్లాపులు భయపెడుతున్నాయి. గరుడ వేగా సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఇది పక్కన పెడితే కొందరు సినీ పెద్దలతో ఆయన పెట్టుకున్న వివాదాలు కూడా రాజశేఖర్ కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి. ఇగో ప్రాబ్లంస్ తో ఆయనకంటే చాలా ఎత్తులో ఉన్న వాళ్ళతో ఆయన కొన్ని అనవసర వివాదాలు పెట్టుకున్నారు. ఇవి రాజశేఖర్ ని ఇబ్బంది పెట్టాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మా అసోసియేషన్ లో పట్టు కోసం చూడటం, కొన్ని వర్గాలను తయారు చేయడం, రాజకీయ అడుగులు ఇవన్నీ కూడా ఆయన కెరీర్ ని ప్రమాదంలోకి నేట్టేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: