టాలీవుడ్ లో నిలబడాలి అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు అనేది వాస్తవం. చాలా మంది హీరోలు ఇలాగే నిలబడ్డారు. తండ్రికి, మేన మావకి ఉన్న ఇమేజ్ తో నిలబడ్డారు. స్టార్ హీరోలు అయ్యారు. అది ఏ కుటుంబం అయినా సరే. అయితే ఒక హీరో మాత్రం నిలబడలేదు. అవును ఒక హీరో ఇబ్బంది పడ్డాడు. అతనే నందమూరి తారక రత్న. నందమూరి హీరోకి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే చేసిన సినిమా ల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి హిట్ ఇవ్వలేదు. బాబాయ్, తమ్ముడు మంచి సినిమాలు చేస్తున్నా తారక రత్న మాత్రం నిలబడలేదు. 

 

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మంచి సినిమాలు చేస్తున్నారు. హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కాని అతను మాత్రం ఇమేజ్ ని వాడుకోలేకపోతున్నారు. నందమూరి హీరోల సినిమా విడుదల అయితే నందమూరి ఫాన్స్ అందరూ దాదాపుగా చూస్తారు. కాని ఆ ఇమేజ్ ని అతను నిలబెట్టుకోవడం లో ఫెయిల్ అయ్యాడు. విలన్ గా కూడా నటించాడు. అయినా సరే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాల్లో కనపడుతున్నా అతని కెరీర్ కి ఉపయోగపడే సినిమా మాత్రం పెద్దగా కనపడటం లేదు. 

 

కుటుంబంలో ఉన్న కొన్ని విభేదాలే అతని కెరీర్ ఇబ్బంది పడటానికి కారణమని చెప్తున్నా అతనికి సినిమాలు చెయ్యాలని ఉన్నా కీలకమైన కథల ఎంపిక, తన ఇమేజ్ కి తన నటనకి తగిన విధంగా కథను ఎంపిక చేసుకోలేకపోవడం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అతను విలన్ గా బాగా సెట్ అవుతాడని కొందరు సలహాలు ఇచ్చినా అతను మాత్రం హీరోగానే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా సరైన సలహాలు ఇవ్వడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: