హీరో తరుణ్ ఒకప్పుడు మంచి స్థానం లో ఉన్న యాక్టర్. మంచి సినిమాల తో ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఒక గొప్ప నటుడు. కానీ నేటి సినిమాల లో తరుణ్ పాత్ర శూన్యం. తరుణ్ సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో మెప్పించేవి. మంచి పాత్రల తో తరుణ్ ఎన్నో సినిమాల తో అప్పట్లో తెర కి ఎక్కాడు. నేటి కాలం లో కనుమరుగవుతున్న హీరోల లో తరుణ్ ఒకడు.
 
 
IHG
 
 
తరుణ్ బాల నటుడి గా పరిచయం అయ్యాడు. తరుణ్ కుమార్ బట్టి తన పూర్తి పేరు. కానీ తరుణ్ గా ప్రేక్షకులని చక్కటి పాత్రల తో తనదైన నటనతో మెప్పించాడు తరుణ్. మాస్టర్ తరుణ్ పేరు తో బాల నటుడిగా అడుగు పెట్టాడు మొదట. ఆ తరువాత అనేక సినిమాల లో తరుణ్ నటించాడు.
 
 
IHG
 
 
ఆదిత్య 369, తేజ వంటి పలు చిత్రాల లో తరుణ్ బాల నటుడి గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత చిరుజల్లు, అదృష్టం, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నిన్నే ఇష్ట పడ్డాను, సఖియా అని ఎన్నో సినిమాల లో హీరో తరుణ్ పాత్రలు ప్రేక్షకులు మెచ్చుకున్నవి. అంజలి చిత్రం తో జాతీయ స్థాయి లో ఉత్తమ బాల నటుడిగా తరుణ్ అవార్డు పొందాడు
 
 
కాని జల్లు మధ్య లో నే ఆగి పోయింది. అవకాశాలు వెతుక్కు రావడం మానేసి, అదృష్టం కూడా ముఖం తిప్పేసుకుంది. ఇంక తరుణ్ కి హిట్స్ రాలేదు. అలానే మంచి అవకాశాలు దొరక లేదు. ఇంక ఫుల్ స్టాప్ పెట్టే స్థాయి లో కూరుకు పోయాడు మాస్టర్ తరుణ్. మంచి దర్శకత్వం వద్దకి చేరక మంచి కధలు రాక చివరికి దూరం అయ్యి పోతున్నాడు తరుణ్. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: