హీరో వరుణ్ సందేశ్ బిగ్ బాస్ తో ప్రేక్షకుల కి మరెంతో దగ్గర అయ్యాడు. వరుణ్ సందేశ్ తెలుగు లో అనేక చిత్రాల లో నటించాడు. చక్కటి నటన తో ఇట్టే ఆకర్షిస్తాడు హీరో వరుణ్. వరుణ్ సందేశ్ తన విద్యాభ్యాసం అంతా అమెరికా లో చేసాడు. తను హ్యాపి డేస్, కొత్త బంగారు లోకం లో నటించిన పాత్రలు అమోఘం. ఈ పాత్రలు నిజంగా ఎంత గానో చెప్పుకో దగినవి.
 
 
IHG
 
 
2007 లో హ్యాపి డేస్ చిత్రం తో పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. అయితే ఆ చిత్రం లో అవకాశం దక్కించు కోవడానికి వరుణ్ శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీల లో పాల్గొన్నాడు. తనకి ఉన్న టాలంట్ తో హ్యాపి డేస్ లో పాత్ర దక్కించుకున్నాడు. హీరోయిన్ తమన్నా తో జంటగా నటించాడు. చందు పాత్రని ఎంతో చక్కగా పోషించాడు. హ్యాపి డేస్ తో వచ్చిన వరుణ్ సందేశ్ తదుపరి అవకాశాలు కూడా తెచ్చుకున్నాడు.
 
 
 
కొత్త బంగారు లోకం సినిమా తో మళ్ళీ తెర పై కనిపించాడు హీరో వరుణ్. ఆ తరువాత ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరో చరిత్ర, హ్యాపి హ్యాపీగా, ఏమైంది ఈ వేళ, కుదిరితే కప్పు కాఫీ ఇలా మరి కొన్ని సినిమాల లో నటించాడు వరుణ్ సందేశ్. కానీ మంచి కధలు ఉన్న సినిమాలు దక్కక పోవడం దురదృష్టమే.
 
 
IHG
 
ఎన్ని సినిమాల లో నటించినా అంత మంచి స్థాయి కి చేరుకో లేదు ఈ హీరో. బిగ్ బాస్ షోలో కనిపించి మళ్ళీ అభిమానులకి దగ్గర అయ్యాడు. భార్య వితిక తో కలిసి పాటల తో, డాన్స్ తో చిందులేసాడు హీరో వరుణ్ సందేశ్.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: