టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సూర్య ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులో ఉన్నారు.  ఆ మద్య రిలీజ్ అయిన గ్యాంగ్, బందోబస్త్ రెండు ఫెయిల్ కావడంతో ఈసారి మంచి హిట్ తో రావాలనుకుంటున్నారు.   తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్న సూర్య క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. తాజాగా సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ  తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది.  

 

ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.హిందీలో గునీత్‌ మోంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయట. ఈ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తో ఓ మూవీకి సిద్దమవుతున్నట్లు సమాచారం. గతంలో  ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'కాక కాక' .. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలు వచ్చాయి. వైవిధ్యభరితమైన సినిమాలుగా ఈ రెండు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. సూర్య కోసం గౌతమ్ మీనన్ ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. ఓ  పది రోజుల్లో ఈ కథను సూర్యకు వినిపించనున్నాడని సమాచారం. ఆల్రెడీ లైన్ వినేసి ఓకే చెప్పిన సూర్య, పూర్తి కథను వినేసిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఖాయమని చెబుతున్నారు. 

 

గౌతమ్ మీనన్ లవ్ ఎమెషన్ ఎంతో గొప్పగా తెరకెక్కిస్తుంటారు.  అయితే గతంలో వీరిద్దరి మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కోటలీవుడ్ లో టాక్ వినిపించింది.  కానీ సూర్య మాత్రం తనకు గౌతమ్ మీనన్ అంటే ఎంతో ఇష్టం.. ఈ విషయం పలుమార్లు చెప్పారు.  గౌతమ్ మీనన్ పట్ల సూర్యకి గల ప్రత్యేక అభిమానం ఈ ప్రాజెక్టును ఓకే చేయడానికి మరో కారణమని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: