జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు.  ఆమె చేసింది ఇప్పటి వరకు ఒక్క సినిమానే.  రెండో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. మొదటి సినిమాతోనే కేక పుట్టించిన జాన్వీ రెగ్యులర్ గా మీడియాలో ఉండేలా చూసుకుంటోంది.   నిత్యం జిమ్ కు వెళ్లే సమయంలో మీడియా తప్పకుండా ఆమెను ఫాలో కావలసిందే.  సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు పోస్ట్ చేయాల్సిందే.  


దీంతో ఆమెకు ఫాలోవర్స్ పెరిగిపోతారు.  ఫాలోవర్లు పెరిగిపోవడం వెనుక చాలా కారణాలు ఉంటాయి.  ఇప్పుడున్న రోజుల్లో  సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటె అంతటి క్రేజ్ ఉంటుంది.  ఆ క్రేజ్ ను వినియోగించుకొని జాన్వీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. శ్రీదేవి కూతురిగా జాన్వీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి కూడా, సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా చూసుకుంటోంది.  


మొదటి సినిమా ధఢక్ తో మంచి పేరు తెచ్చుకుంది.  ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.  ఇప్పుడు జాన్వీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.  ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనదైన శైలిలో ఫోటో షూట్ లు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నది.  అయితే, శ్రీదేవి కోరిక మాత్రం ఇంకా తీరలేదని చెప్పాలి.  ఎందుకంటే, జాన్వీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నది.  


కానీ, ఆ కోరిక తీరకుండానే ఆమె కన్ను మూసింది.  విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో జాన్వీ చేస్తుందని అనుకున్నారు.  ఎందుకంటే ఫైటర్ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.  దీంతో ఆ సినిమాలో జాన్వీ చేస్తుందని అనుకున్నారు.  కానీ, జాన్వీ డేట్స్ సర్దుబాటు కాకపోవంతో ఆ సినిమా మిస్ అయ్యింది.  పైగా ఇప్పుడు విజయ్ కు కొంత డౌన్ నడుస్తోంది.  విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరసగా ఫెయిల్ అవుతున్నాడు.  జాన్వీ సౌత్ ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: