ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడుగా, అక్కినేని నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. టాలీవుడ్‌లో తిరుగులేని లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఆయ‌న త‌న‌యుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అక్కినేని నాగార్జున కూడా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఈయ‌న త‌న‌యులు అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్  కూడా టాలీవుడ్‌లో బాగానే దూసుకుపోతున్నారు. మ‌రియు అక్కినేని నాగేశ్వర‌రావు మ‌రో మ‌న‌వుడు సుమంత్ హీరోగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండ‌డంతో పాటు సొంత బ్యాన‌ర్‌పైనే  సినిమాలు తీసినా సుశాంత్‌కు మాత్రం హిట్లు ప‌డ‌డం లేదు.

 

సుశాంత్ ..2008 లో కాళీదాసు అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత కరెంట్ అనే చిత్రంలో నటించాడు సుశాంత్.. ప్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా సుశాంత్ కి ఓ మోస్త‌రు హిట్టును ఇచ్చింది. ఇక‌ ఆ తర్వాత చేసిన అడ్డా, ఆటాడుకుందాంరా సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో వెండితెరకు కొంచెం దూరంగా ఉంటూ వ‌చ్చాడు సుశాంత్. అవకాశాలు వచ్చి రాకనో గ్యాప్ వచ్చిందో లేదా తీసుకున్నాడో తెలియ లేదు. ఇలా చాలా కాలం సుశాంత్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కథలు వింటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో హీరో నుంచి దర్శకుడిగా మారినా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చి.ల.సౌ అనే సినిమా కూడా ఓకే అనిపించుకుంది కానీ, అంత పెద్ద‌గా ఆడ‌లేదు.

 

ఇలా ఎన్ని సినిమాలు చేసినా సుశాంత్‌కు మాత్రం ఒక్క మంచి హిట్ కూడా ప‌డ‌లేదు. దీంతో అటు మేన‌మామ కూడా హీరో సుశాంత్ సోలో హిట్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా ఫ‌లితం రాలేదు. అయితే  కెరియర్ మొదట్లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సుశాంత్‌ .. కథల ఎంపికలో వైఫల్యంతోనే ఫ్లాఫ్స్ మూటగట్టుకున్నాడు అన్నది వాస్త‌వం. ఇటీవ‌ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించాడు. మ‌రి ముందు ముందు అయినా మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని హిట్ హీరోగా నిలుస్తాడో లేదో చూడాలి. 


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: