టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,,,  అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో. సంక్రాంతి ముందు విడుదలైన ఈ సినిమా.. సంచలన విజయాన్ని నమోదు చేసింది అనే చెప్పాలి.అయితే... హిట్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అంటూ ప్రూవ్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా సంచలన వసూళ్లు రాబట్టి అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమాను ఈ నెల 26న జెమినీ టీవీ సంస్థకు చెందిన సన్ నెక్స్ట్ యాప్ లో విడుదల  చేస్తామని ఇదివరకే ప్రకటించారు. 

 


 అయితే సాధారణంగా మాత్రం స్టార్ హీరోల సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలను నెట్ ఫ్లిక్స్ అమెజాన్ యాప్ లలో విడుదల చేస్తూ ఉంటారు. కానీ గతంలోనే ఈ రెండు యాప్స్ లో  సినిమాను రిలీజ్ చేయము  అంటూ అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ లు  ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్లో ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం అలా వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సన్ నెక్స్ట్ యాప్  లో రిలీజ్ కావాల్సిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా కాస్త నెట్ ఫ్లిక్స్ లో  రిలీజ్ అయింది. మామూలుగా అయితే ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఎన్నో ప్రకటనలు ఉంటాయి... ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా  ఎన్నో ప్రకటనలు చేస్తుంటుంది నెట్ ఫ్లిక్స్. 

 


 కానీ ప్రస్తుతం అలా వైకుంఠపురములో సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు ఎలాంటి ప్రకటనలు లేకుండానే నెట్ ఫ్లెక్స్ లో అల వైకుంఠ పురములో సినిమా విడుదలయ్యింది. అయితే ఇలా విడుదలవడం వల్ల అటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పటికే అలా వైకుంఠపురములో  ఫుల్ రన్ ద్వారా వచ్చిన వసూళ్లతో  8 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కాబట్టి ఇప్పుడు నెట్ ఫ్లెక్స్ లో అలా వైకుంఠపురములో  సినిమా విడుదల అయినంత మాత్రాన... ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఎలాంటి నష్టం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండే అభిమానులు ఎవరైనా థియేటర్లో అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా చూడని వారు ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో  చూడడానికి వీలు ఉంది. అయితే మరో వైపు నుంచి సినిమ వసూళ్లను  పెంచుకోవడానికే నెట్ ఫ్లిక్స్  అమెజాన్ లలో సినిమా  విడుదల చేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: