స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అల వైకుంఠ పురంలో' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన చిత్రం అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా బాహుబలి రికార్డులను తిరగరాసి అన్నింటినీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు అల్లుఅర్జున్ 100 కోట్ల రూపాయల దరిదాపుల్లోకి రాని నేపథ్యంలో.... ఏకంగా చిత్రంతో 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరియు యు.ఎస్ లో కూడా 3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము రేపాడు.

 

చిత్రం విషయంలో కథ మరియు కంటెంట్ కు ఉన్న ప్రాముఖ్యత ఎంతో పబ్లిసిటీ విషయంలో చిత్రబృందం అవలంబించిన దూకుడు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. సామజవరగమన పాట నాలుగు నెలల ముందే వదిలి సాహసం చేసిన మేకర్స్ చివరికి విషయంలో భారీగా సక్సెస్ పొందారు అనే చెప్పాలి. అంతేకాకుండా చిత్రం విడుదల సమయంలో పోస్టర్ పై చిత్రం మీకు అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లెక్స్ లో అందుబాటులో ఉండదు అని ప్రత్యేకంగా క్యాప్షన్ పెట్టి మరీ వేయడం జనాలను విశేషంగా ఆకర్షించింది.

 

ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక డిజిటల్ విప్లవం లో పడి ప్రజలందరూ నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వైపు విపరీతంగా ఆకర్షితులయ్యారు. సినిమా ఏదైనా థియేటర్ లో వచ్చిన నెల నాళ్ళకే వాటిలో ప్రత్యక్షమౌతుండడంతో జనాలు ఎలాగో అప్పుడు వస్తుంది కదా అని థియేటర్లకి రావడమే తగ్గించేశారు. అయితే సినిమా మాత్రం వాటిలో ఉండదు అని అనేసరికి జనాలంతా చచ్చినట్లు థియేటర్ల వైపు కదిలాడు.

 

కట్ చేస్తే ఈరోజు సన్ నెక్స్ట్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సరే అది ముందునుంచీ తెలిసిన విషయమే కదా అని అనుకుంటే సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆశ్చర్యపోయి ప్రజలు.. మమ్మల్ని థియేటర్లకు రప్పించడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారా అని విపరీతంగా ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: