తెలుగు లో యాంకర్ సుమ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆమె లేనిదే కొన్ని ఈవెంట్స్ ఉండవు అన్నంతగా ఉంటాయి. తెలుగు లో ఎంత మంది యాంకర్స్ ఉన్నా.. సుమ కనకాల కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.  స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆమె వాయిస్ ఉంటేనే అది సక్సెస్ అవుతుందన్న సాంప్రదాయం నెలకొంది.  ఇక ఇతర యాంకర్స్ ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి లు ఉన్నా ఇప్పటికీ సుమ యాంకరింగ్ అంటనే ఇష్టపడేవారు ఉంటారు.  ఒక మూవీ ఈవెంట్ నిర్వహిస్తుంటే.. ఆ మూవీకి సంబంధించిన అన్ని విషయాలు ఆమె అనర్ఘలంగా మాట్లాడే సత్తా ఉంటుంది.. అందుకే దర్శక, నిర్మాతలే కాదు హీరోలు సైతం యాంకర్ సుమ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. 

 

అంతే కాదు ఒక్కో ఈవెంట్ కి ఆమె లక్షల్లోనే వసూళ్లు చేస్తుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.  సుమ భర్త రాజీవ్ కనకాల నటుడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  తాజాగా సుమఈవెంట్ కి హాజరు కావాల్సి ఉండగా అప్పటికే అక్కడి హాల్ పూర్తిగా జనాలతో నిండిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో సుమ అక్కడి సెక్యూరిటీ సహాయంతో కిటికీ లోనుంచి దూకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.   మేకప్ వేసుకుని, చక్కగా తయారై ఆమె.. ఇలా కిటికీలోంచి లోపలి నుంచి దూరి వెళ్లిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

వాస్తవానికి ఆ ఈవెంట్ కి ఆమె బహుషా లేట్ గా రావడం వల్ల అప్పటకిే జనాలతో ఫుల్ ప్యాక్ కావడంతో ఆమె కిటికీ లో నుంచి జంప్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు.  ఏది ఏమైనా సెలబ్రెటీలు అయ్యాక కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నడానికి ఇదో ఉదాహారణ.  గతంలో సూర్య కాకినాడలో ఓ థియేటర్ కి వచ్చాక.. ఆయన బయటకు వెళ్లే ప్రయత్నంలో అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో బయట గోడ దూకి మరీ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: