ఆమె ఒక స్టార్ యాంకర్.. ఆమె షో చేస్తుంటే అంతా సందడే సందడి.. తను ఉన్న షోలో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తుంది ఈ అమ్మడు. ఛానెల్ ఏదైనా..  షో ఏదైనా అమ్మడు చేస్తుంది అంటే ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అన్నట్టే. ఈ మధ్య ఓ రియాలిటీ షోలో కొన్నాళ్ళుగా అక్కడే ఉన్న ఈ అమ్మడు మళ్ళీ వరుస షోలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా ఈ అమ్మడు ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ వ్యక్తితో డేటింగ్ లో ఉందట. 

 

అతనితో ఈ యాంకర్ డేటింగ్ చేస్తుందని టాక్. వీళ్ల వ్యవహారం చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నారట. తన ఉన్న క్రియేటివ్ ఫీల్డ్ లో ఎంతోమంది తనని ఇష్టపడినా ఈ యాంకర్ మాత్రం ఆ సాఫ్ట్ వేర్ అబ్బాయి వల్లో పడ్డదని అంటున్నారు. అతనితో నైట్ పబ్బులు, పార్టీలు అంటూ తెగ తిరిగేస్తుందట. వీళ్ల రిలేషన్ కేవలం డేటింగ్ వరకేనా లేక పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లికి మూవ్ అయ్యే ఆలోచన ఉంటేనే వాళ్ల రిలేషన్ గురించి అఫీషియల్ గా చెబుతారట. లేదంటే ఇలానే కొన్నాళ్ళు సీక్రెట్ గా కానిచ్చి తర్వాత సైలెంట్ గా ఎవరిదారి వారు చూసుకుంటారని టాక్. 

 

టాప్ యాంకర్ గా ఉన్న ఈ అమ్మడి ఈ సీక్రెట్ ఎఫైర్ తెలిసిన సన్నిహితులు ఆమెని మందలించారట. ఆమె మాత్రం వారి మాటలని చాలా లైట్ తీసుకుందని తెలుస్తుంది. బుల్లితెరతో పాటుగా సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆమె తన ప్రతిభ చాటుతుంది. మరి ఈ యాంకర్ డేటింగ్ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుంది. అందరికి తెలిసేలోగా అంతా సెట్ రైట్ చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. మీడియా దాకా మ్యాటర్ లీక్ అయ్యింది అంటే యాంకర్ ఇక మీదట చాలా జాగ్రత్త పడితే మంచిదని కొందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: