ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రత్యకంగా నిలుస్తాయి.  అందులో ఒకటి జేమ్స్ బాండ్.. ఇది ఒక నవల ఆధారంగా తెరకెక్కించారు.  అప్పట్లో ఈ మూవీకి మంచి ఆదరణ రావడంతో వరుసగా సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. జేమ్స్ బాండ్  హాలీవుడ్ లో ఈ సిరీస్ మూవీస్ మంచి గిరాకీ ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ సినిమాలు డబ్బింగ్ అవుతాయి. హాలీవుడ్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులను అలరిస్తాయి. తాజాగా జేమ్స్ బాండ్ మూవీ మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.   'నో టైమ్‌ టూ డై' పేరుతో వస్తున్న జేమ్స్ బాండ్ మూవీ ట్రెయిలర్ ఇప్పటికే విడుదలై దుమ్మురేపుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు వ‌చ్చిన‌ 24 సినిమాలు మంచి విజ‌యం సాధించాయి.  

 

ఒక కేరెక్టర్‌తో 56 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అల‌రిస్తున్నాయి.    జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు. నియల్ క్రేగ్ హీరోగా నటిస్తోన్న 5వ సినిమా ఇది.  కారీజోజి పుకునా తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ నో టైమ్ టూ డై చిత్ర ట్రైల‌ర్ రేపు 10 భాష‌ల‌లో విడుద‌ల కానుంది.  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, భోజ్‌పూరీ, బెంగాలీ, మలయాళీ భాషలలో ట్రైలర్ సందడి చేయనుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

కిడ్నాప్‌కు గురైన ఓ సైంటిస్ట్‌ను కాపాడేందుకు మళ్లీ జేమ్స్‌బాండ్‌ను ఉద్యోగంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత జరిగినే సంఘటనే ఈ సినిమా స్టోరీ అని  తెలుస్తుంది. ఈ సినిమాను మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి. అయతే నియల్ క్రేగ్ ఈ మూవీ చివరిది కావడంతో.. సినిమాలో జేమ్స్ బాండ్ పాత్రను చంపేస్తారా..? లేదా అతనికి రిటైర్మెంట్ ఇస్తారా..? లేదా అతను చనిపోవడాన్ని ఫేక్ అని చూపిస్తారా..? ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల్లో రేకెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: