బాలీవుడ్‌ నటి, కొంకణా సేన్‌ శర్మ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈమె నటిగానే కాకుండా, రచయిత్రి, దర్శకురాలుగా అందరికి సుపరిచితమే. కొంకణా తన సహనటుడు రణ్‌వీర్‌ షోరేను 2010లో వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఈమె ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’, ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌’, ‘ఆజా నాచ్‌లే’ వంటి సినిమాలో కలిసి వీరు నటించారు. ఆ క్రమంలోనే వారి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2007 నుంచి 2010 వరకూ సహజీవనం చేశారు. 

 

IHG

 

తదుపరి, 2010లో వీరు వివాహం చేసుకుని, 2015లో వైవాహిక బంధానికి శుభం పలుకుతూ, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అప్పట్లో వెల్లడించారు.  వీరికి ఆరేళ్ల కుమారుడు హరూన్‌ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే, కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. 2015లో దూరమైన ఈ జంట ఇప్పటి వరకు విడాకులు తీసుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ క్రమంలో తాజాగా వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బాలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

 

దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఆరునెలల్లో అధికారికంగా విడాకులు అందనున్నట్లు సమాచారం. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కౌన్సెలింగ్ తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకపోవడంతో విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భోగట్టా. బాలీవుడ్ లో ప్రేమాయణాలు ఎంత త్వరగా మొదలవుతాయో అంతే త్వరగా శుభం కార్డు పడతాయని, అందరికీ తెలిసిన కధే.

 

IHG

 

2015 లో తన ఆఫీసియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె, తన విడాకుల సంగతి తెలియజేసింది. అప్పట్లో ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ రణ్ వీర్ కూడా ట్విట్టర్లో సందేశం ఇచ్చాడు. కానీ, వాళ్ళు అప్పుడు లీగల్ గా ఈ విషయమై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇన్నేళ్లు కాంప్రమైజ్ కోసం ఆలోచించిన ఈ జంట, చివరాఖరకు కలిసి బతకలేం అని నిర్దారించుకొని, లీగల్ గా విడిపోతున్నట్లు తాజాగా వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: