చక్కనమ్మ ఏం చేసినా.. అందమే. అవును.. ఈ వాక్యం సరిగ్గా రశ్మికకు సరిపోతుంది. తెలుగు చిత్ర సీమలో ప్రవేశించిన అతి కొద్ది కాలంలోనే, అమ్మడు అగ్ర తారల వరుసలో చేరిపోయింది. తాజాగా ‘భీష్మ’తో సూపర్ డూపర్ హిట్, తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడబ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి తమిళ పాపులర్ కమెడియన్ వడివేలులా రష్మిక పెట్టిన పోజులు, నెటిజన్లను  ఫిదా చేస్తున్నాయి. 

 

IHG

 

ఇటీవల రష్మిక సరదాగా ఓ ఫోటోషూట్ చేసింది. అందరి దారిలో హీరోయిన్లలా పోజులిస్తే గమ్మత్తు  ఏముంటుంది.. అనుకుందేమో మరి.. క్యూట్ క్యూట్ గా చిన్నపిల్లల్లా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి, నవ్వులు పూయించింది. ఇక ఈ పిక్స్‌ చుసిన నెటిజన్స్, రష్మిక క్యూట్‌క్యూట్‌.. బబ్లీ బబ్లీ.. అని మంచి కాంప్లిమెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన, హాస్య నటుడు వడివేలు నటించిన గత చిత్రాలలోని పోజులను ఇమిటేట్ చేసింది. 

 

రష్మిక, వడివేలు ఓల్డ్ పిక్స్ చూసి, సేమ్ టు సేమ్ భంగిమల్లో ఫోటోలు తీసుకొని అదరగొట్టింది. అయితే వాటికి జతగా.. నెటిజన్లు రష్మిక ఫోటోల పక్కన సేమ్ టు సేమ్ భంగిమలతో ఉన్న నటుడు వడివేలు ఫోటోలను పోస్ట్‌ చేసి, మీమ్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మీమ్స్‌ కాస్తా రష్మిక దృష్టిలో పడడంతో.. ఆమె స్పందిస్తూ.. “నేను క్యూట్‌గా ఉన్నానంటే ఒప్పుకోను. నాకంటే వడివేలు చాలా క్యూట్‌గా ఉన్నారు’’ అంటూ రిప్లై ఇచ్చింది.

 

IHG

 

వడివేలు తమిళనాట మంచి పేరున్న హాస్య నటుడు. ఇక్కడ మన బ్రహ్మానందం మాదిరి. ఇంకా ఇతని ప్రత్యేకత ఏమంటే, ఈయన సింగర్ కూడా. ఇది అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయన నటనకి గాను, అనేక అవార్డులు, రివార్డులు పొందారు. ఆయన ప్రజాదరణకు మీడియా ఆయనకు "వైగై పుయాల్" అనే మారుపేరు పెట్టింది. దీనిఅర్థం మధురై వైపు ప్రవహిస్తున్న వైగై నది నుండి వచ్చిన తుఫాను అని అర్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి: