కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించి స్టార్ హీరోల సినిమాలను సైతం తోసి టాప్ పొజిషన్ లో నిలిచిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ కి రెంటింగ్ లో మరో సీరియల్ కి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప అలియాస్ వంట‌ల‌క్క‌ కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. సీరియల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా దీప మారిపోయింది.  కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. 

 

విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సీరియల్‌ దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిందంటే ఈ సీరియర్ కున్న క్రేజ్‌ ఏ పాటితో చెప్పాల్సిన పనిలేదు. ఇక ముఖ్యంగా కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియర్ నానింది. మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం వంట‌ల‌క్క సొంతం. అయితే గ‌త కొన్ని రోజులుగా దీపక్క ప్లేస్‌ను మార్చబోతున్నారంటూ ఓ రూమర్ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. 

 

దీంతో ఒక్క‌సారిగా వంట‌ల‌క్క ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. ఎందుకంటే.. వంట‌ల‌క్క అంటే.. కార్తీకదీపం.. కార్తీకదీపం అంటే వంట‌ల‌క్క అని వీరు విప‌రీతంగా ఫిక్స్ అయిపోయారు. దీంతో టాప్ రేటింగ్ వస్తున్న సీరియల్‌లో దీపక్కను మార్చేయాల్సిన అవసరం ఏంటన్న విషయాలు వెతికే పనిలో పడ్డారు. అయితే అస‌లు విష‌యం ఏంటా అని చూస్తే.. దీపక్క రెమ్యూనరేషన్ అనేది గట్టిగా వినిపిస్తున్నమాట. ఈ సీరియల్ స్టార్టింగ్‌లో తక్కువ పారితోషికానికి నటి ప్రేమి విశ్వనాధ్ ఒప్పుకున్నారట. 

 

అయితే క్రమేపి కార్తీకదీపం అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌కు చేరుకోవడంతో వంట‌ల‌క్క రెమ్యున‌రేష‌న్ కూడా నాలుగు రెట్లు పైగా పెంచారని సమాచారం. అయితే తాజాగా దీపకు వేరే సీరియల్స్ నుంచి భారీ ఆఫర్లు వస్తుండటంతో రెమ్యునరేషన్‌ను మ‌రింత ఎక్కువ‌గా డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే వంట‌ల‌క్క ఈ సీరియ‌ల్ నుంచి ఔట్ అవుతుంద‌ని ప్ర‌చారం చేశారు. అయితే తాజాగా దీనిపై సీరియ‌ల్ యూనిట్ స్పందించింది. దీప బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం.. ఆమె ప్లేస్‌లో మ‌రొక‌రిని రీ ప్లేస్ చేయ‌డం.. ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. దీంతో దీప‌క్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: