ఈ మద్య  మాజీ హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ సభ్యురాలు మాధవీలత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.  ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం సంపాదించలేకపోయింది.  ఆ మద్య పవన్ కళ్యాన్ గురించి మాట్లాడిన ఈ అమ్మడు తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.  అంతే కాదు కాస్టింగ్ కౌచ్ పై కూడా మాధవీలత తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తుంది. ఈ మద్య మాధవి లతకు సినిమాలు లేవు.. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.  దాంతో కొంత మంది ఆమెను కొన్ని వ్యంగమైన ప్రశ్నలు వేస్తున్నారట.  

 

సినిమాలు చేయడం లేదు కదా మీకు డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయంటూ ఈ మధ్య కొందరు పదేపదే అడుగుతున్నారని.. వాళ్లకు అసలు సిగ్గులేదని చెబుతుంది మాధవి లత. సినిమాలు శాశ్వతం కాదని తమకు కూడా తెలుసని.. అందుకే బిజినెస్ చేయడం తమకు కూడా అర్థమైందని అక్కడ్నుంచే డబ్బులు వస్తాయని చెబుతుంది. అమ్మాయిలకు డబ్బులు అంటే కేవలం పడుకుంటేనే వస్తాయా.. ముందు మీరు మారిచావండ్రా అంటూ రెచ్చిపోయింది మాధవి. మీకు సిగ్గు లేదు.. అమ్మాయిల గురించి అలా ఆలోచించడానికి.. మీ అమ్మ, అక్క, పెళ్లాంకు ఎక్కడ్నుంచి వస్తున్నాయిరా డబ్బులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి.  

 

గతంలో కూడా కొంత మంది నెటిజన్లు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వారిపై విరుచుకుపడింది. మొన్నటికి మొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది ఈమె.  తాము కూడా చదువుకున్నవారమే అని తమకు కూడా ఉద్యోగాలు చేస్తే డబ్బులు వస్తాయని ఇలాంటి ఛండాలమైన ప్రశ్నలు ఎలా వేయాలనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది మాధవీలత. 

మరింత సమాచారం తెలుసుకోండి: