ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇతర భాషల్లో కూడా ఎక్కువగా రిమేక్ చిత్రాలపై దృష్టిపెడుతున్నారు.  ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తమ భాషలోకి తమ నేటివిటీకి తగ్గట్టుగా రిమేక్ చేస్తున్నారు.  ఇలాంటి చిత్రాలు చిన్నా, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా రిమేక్ లపై దృష్టి సారిస్తున్నారు.  తాజాగా రిమేక్ చిత్రాలపై తనకు అస్సులు ఇంట్రస్ట్ లేదని చెబుతున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.  మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు, తమిళ, మళియాళ బాషల్లోనే కాదు బాలీవుడ్ లో కూడా నటిస్తున్నాడు. తెలుగు భాషల్లోను మంచి క్రేజ్ వుంది.

 

ఆ మధ్య 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన ఆయన, తాజాగా తమిళంలో 'కన్నుమ్ కన్నుమ్ కల్లైయాడి తాల్' చిత్రం చేశాడు. దేశింగ్ పెరియసామి దర్శకత్వం  ‘కన్నుమ్ కన్నుమ్ కల్లైయాడి తాల్' నటించిన దుల్కర్ ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో 'కనులు కనులను దోచాయంటే' గా రాబోతుంది.  తాాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగాంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందింది. పాటలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  ఇక రిమేక్ చిత్రాలంటే నేను పెద్దగా శ్రద్ద చూపించను.  ఎందుకంటే మన నేటివిటీకి తగ్గ చిత్రాల్లో నటిస్తే మన పవర్ ఏంటో తెలుస్తుంది.

 

ఆల్రెడీ ఓ భాషలో హిట్ అయిన చిత్రం మనం నటించడం కమర్షియల్ గా బాగుంటుంది కానీ.. నా విషయంలో అయితే అది పెద్దగా గ్రేట్ అనిపించదు.  కొత్తగా వున్న కథలను చేయడానికే ఇష్టపడతాను. అలా కథాపరంగా .. పాత్ర పరంగా కొత్తగా అనిపించడం వల్లనే ఈ చిత్రం చేశాను. ఈ చిత్రం తప్పకుండా నాకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. ఈ మద్య తెలుగులో డైరెక్ట్ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: