బిగ్ బాస్ సీజన్ 3 లో చక్కటి ఎనర్జీ తో ఓ ఊపు తెప్పించింది. మూడ్స్ ని అటూ ఇటూ స్వింగ్ చేస్తూ ఓ ఆట ఆడించింది. నెక్స్ట్ నువ్వే, ఉన్నది ఒకటే జిందగీ అంటూ సినిమాల లో చిన్న పాత్రలు చేసింది. కానుక పాత్ర లో ఉన్నది ఒకటే జిందగి లో చక్కగా నటించింది హిమజ.
 
 
IHG
 
 
అంతే కాకుండా నేను శైలజ, ధృవ, మహానుభావుడు వంటి పలు చిత్రాల లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి ఎంతో ఆకట్టుకుంది. సినిమాల లో నెమ్మది గా ప్రయాణం చేస్తూ బిగ్ బాస్ లో అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులకి ఎంత గానో దగ్గర అయ్యింది ఈ అందాల భామ.
 
IHG
 
 
 
కేవలం సినిమాల పై మాత్రమే కాక టీవి సీరియల్స్ లో కూడా నటించింది హిమజ. ఇలా తన సమయం తో అటో కాలు ఇటో కాలు వేస్తూనే బిగ్ బాస్ లో పోటిదారి గా ప్రవేశం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో అరుపుల తో మెరుపు తెప్పించింది. అల్లరి తో ఆట తో చలాకీ గా పరిగెట్టింది. ఇలా హిమజ ప్రతీ కోణం లో ఎంతో బాగా ఆకట్టుకుంది. డాన్స్ స్టెప్పు ల తో కేక పెట్టించింది.
 
 
 
అలానే ఓ సక్కనోడా....అంటూ పాటల జల్లుని కురిపించింది ఈ భామ. బిగ్ బాస్ నుండి వచ్చాక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చలాకీ గా ఉంటోంది. అనేక ఫోటోల తో తన అందాన్ని చూపిస్తోంది ఈ బ్యూటి. ఫోటో షూట్స్ జరిపించి ఆ ఫోటోస్ ని పోస్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన వాటికి ఓ మంచి రెస్పాన్స్ వచ్చింది హిమజ కి. ఇలా ఫోటోస్ తో తన అందాలని చూపిస్తోంది ప్రేక్షకులకి 

మరింత సమాచారం తెలుసుకోండి: