గత కొన్ని రోజులగా దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికి పోతుంది. ఇప్పటి వరకు సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు చేరింది.  300 మందికిపైగా గాయపడినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆందోళనల సమయంలో దుకాణాలు, ఇళ్లకు నిప్పు పెట్టడంతో వాటిల్లో ఉన్నవారు గాయపడిన ఘటనలు బయటికి వస్తున్నాయి.  ఎక్కడిక్కడ పారా మిలటరీ, పోలీసులు పహారా కాస్తున్నారు.  యాంటీ సీఏఏ ఆందోళనలకు కీలక కేంద్రాలుగా ఉన్న మౌజ్ పూర్, భజన్ పురా, కరవాల్ నగర్, జఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడిపోతున్నారు.

 

వ్యాపార రంగం పూర్తిగా కుటుంబ పడిపోతుంది.  ప్రతిరోజు కూలీ చేసుకునే వారు పనుల్లేక నానా అవస్తలు పడుతున్నారు.అయితే ఢిల్లీ హైకోర్టు కూడా గట్టిగా అక్షింతలు వేయడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా ఆందోళన కారులు ఓ దుకాణాన్ని తగల బెట్టడంతో వచ్చిన పొగ కారణంగా పక్కనే ఉన్న ఇంట్లో ఓ వృద్ధురాలు ఊపిరాడక చనిపోయింది. ఇలా ఎక్కడ చూసినా అరాచకాలు పెరిగిపోయాయి. తాజాగా ఢిల్లీ అల్లర్లపై బాలీవుడ్ సంచలన దర్శకుడు అనుభవ్ సిన్హా వ్యాఖ్యానించారు.  ఈ అల్లర్లు చూస్తుంటే.. మనుషులు ఇంకా ఒకప్పటి జంతువుల్లానే ప్రవర్తిస్తున్నారని  అనిపిస్తుందని అన్నారు.

 

తాజాగా దర్శకత్వం వహించిన ‘థప్పడ్’ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోల్లో మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. అదిచూసి మనం ఒకప్పుడు జంతువులం, బహుశా ఇప్పటికీ అలానే ఉన్నాం అని అనిపించింది. చాలామంది నన్ను చాలా కఠినంగా మట్లాడతానని అంటారు. అవును నిజాలు నిర్భయంగా మాట్లాడాలి.. అప్పుడే మన గురించి ఎవరికైనా తెలుస్తుందని అన్నారు. నిజం మాట్లాడితే చేదుగా, కఠినంగా అనిపిస్తుంది అని అనుభవ్ సిన్హా అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: