టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా ఏ వుడ్ లో అయినా సరే హీరోయిన్ల మీద జరిగే తప్పుడు ప్రచారాలు అన్నీ ఇన్నీ కాదు అనేది వాస్తవం. వాళ్ళు ఎం చేసినా సరే ఇదే విధంగా ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు అభిమానుల రూపంలో ఉన్న జనం. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ గురించి చేసే ప్రచారాలు చూసి కొందరికి జాలి అనిపించినా సరే మరికొందరికి మాత్రం వినోదంగానే ఉంటుంది అనేది వాస్తవం. సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలు అన్నీ ఇన్నీ కాదు. 

 

ఈ మధ్య ఈ జబ్బు మరింత ఎక్కువైంది కొందరికి అనేది వాస్తవం. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్లు వాళ్ళతో పడుకున్నారు వీళ్ళతో పడుకున్నారు అంటూ రాస్తున్నారు. వాళ్ళతో అఫైర్ నడుపుతున్నారు వీళ్ళతో నడుపుతున్నారు అంటూ కొన్ని అభ్యంతరకర రాతలు రాస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానుల రూపంలో ఉన్న వాళ్ళు చేసే దరిద్రం అంతా ఇంతా కాదు. తాజాగా మహేష్ బాబు హీరోయిన్ ని ఇలాగే ఒక దర్శకుడి పక్కన పడుకోబెట్టింది సోషల్ మీడియా. 

 

వాళ్ళు ఎక్కడైనా కనపడినా లేదా ఎక్కడైనా వాంతు చేసుకున్నా సరే అందుకే అంటున్నారు. హీరోయిన్ డేట్స్ గురించి హీరోలు మాట్లాడుతున్నారు అంటూ ఏది పడితే అది రాస్తూ హడావుడి చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్స్ కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నాయి. ఇక హీరోయిన్ల పెళ్లి గురించి వాళ్లకు వచ్చే అవకాశాల గురించి కూడా అనవసర రాతలు అన్నీ రాస్తుంది సోషల్ మీడియా. అసభ్యంగా రాస్తూ వాళ్లకు తోచింది ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రచారం దెబ్బకు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా ఫోటో పోస్ట్ చేయడం ఆలస్యం ఇదే విధంగా ప్రచారం చేస్తూ నరకం చూపిస్తున్నారు కొందరు ప్రబుద్దులు.

మరింత సమాచారం తెలుసుకోండి: