అనుష్క టాలీవుడ్లో సీనియర్ నటీమణి.  గొప్ప అందగత్తె. మంచి నటిగానే కాదు సూపర్ డూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె చేసిన పాత్రలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  సినీసీమలో ఇపుడున్న పరిస్థితుల్లో అనుష్క మాదిరిగా విభిన్న పాత్ర పోషణ చేసిన నటీమణి వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అనుష్కది సిల్వర్ స్క్రీన్ తో పదిహేనేళ్ళ అనుబంధం.

 

ఇదిలా ఉండగా 38 ఏళ్ళ  అనుష్క ఇప్పటికీ  పెళ్ళి చేసుకోకపోవడంతో  రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఆమె టాలీవుడ్ లో ఓ  టాప్ హీరోను పెళ్ళి చేసుకుంటుందని ఇప్పటికీ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఆమె ఓ ప్రొడ్యూసర్ ని పెళ్ళి చేసుకుంటుందని పుకార్లు పుట్టించారు.

 

అదే విధంగా ఆమె టాలీవుడ్ లో ఓ  టాప్ డైరెక్టర్ తో కూడా ప్రేమాయణం నడిపిందని రూమర్స్ ఎన్నో స్ప్రెడ్ చేశారు. ఎప్పటికపుడు అనుష్క వీటన్నిటినీ తిప్పికొడుతూ వచ్చింది. తాజాగా ఆమె తాను తన తల్లిదండ్రులు ఎవరిని ఎంపిక చేసి వారిని పెళ్ళి చేసుకోమంటే తల వంచి మరీ తాళి కట్టించుకుంటానని కూడా పక్కా క్లారిటీగా చెప్పుకొచ్చింది.

 

అయినా రూమర్లు ఆగవుగా. తాజాగా మరో రూమర్ ఒకటి అనుష్క పెళ్ళి గురించి పుట్టుకొచ్చింది. అదేమంటే అనుష్క టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ కొడుకుని పెళ్ళి చేసుకుంటుందని, ఆ కొడుకు కూడా డైరెక్టర్ గా ఉన్నారని. ఆయన ఈ మధ్యనే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి లైన్ క్లియర్ చేసుకున్నాడని కూడా ఆ రూమర్.

 

ఇక ఆ డైరెక్టర్ అనుష్కతో  ఓ సినిమా కూడా తీశారు. అనుష్క కూడా నిశ్శబ్దం అన్న మూవీ మాత్రమే చేస్తోంది. ఆ తరువాత ఆమె కొత్త మూవీకి సైన్ చేయలేదు. దాంతో ఈ రూమర్స్ బాగానే పుట్టించారు. అనుష్క అతన్ని పెళ్ళి చేసుకునేందుకే కొత్తగా మూవీస్ ఒప్పుకోవడంలేదని చాటుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అనుష్క పెళ్ళి మాత్రం రూమర్స్ తోనే అయిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: