ప్రస్తుతం హాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో టాపిక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచినవాటిలో ‘జురాసిక్‌ వరల్డ్‌ 3’ ఒకటి. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు కోలిన్‌ ట్రెవరో దర్శకత్వంలో క్రిస్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జురాసిక్‌ వరల్డ్‌ 3. జురాసిక్‌ ఫ్రాంచైజీలో చిట్టచివరి పార్ట్ కూడా ఇదే.  జురాసిక్‌ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి చిత్రం ‘జురాసిక్‌’ (1993)లో వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లల నుంచి పెద్దల వ‌ర‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. 

 

పుస్తకాల్లో చరువుకున్న డైనోసార్లు తెరమీద ప్రత్యక్షం కావడంతో ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ త‌ర్వాత 2018లో సెకండ్ పార్ట్ ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుని వందలకోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.  2018లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్డమ్‌’ చిత్రానికి కోలిన్‌ రచయితగా వ్యవహరించగా, జె.ఎ.బయోనా దర్శకత్వం వహించాడు.  ఇప్పుడు ‘జురాసిక్‌ వరల్డ్‌ 3’పైనే అందరి దృష్టి ఉంది. సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మొదటగా ‘జురాసిక్‌ వరల్డ్‌ 3’గా పేరు పెట్టారు. 

 

కానీ, ఈ చిత్రానికి ‘జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌’గా ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు. అలాగే కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్‌ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్‌ అదిరిపోయే రేంజ్‌లో ఉందని కీలక పాత్రధారి క్రిస్‌ ప్రాట్‌ పేర్కొన్నారు. కాగా, అంబ్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, లెజెండరీ పిక్చర్స్, యూనివర్సల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సామ్‌ నీల్, బ్రైస్‌ డల్లాస్, లారా డెర్న్‌ తదితర నటీనటలు నటిస్తున్నారు. స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌ సహనిర్మాతగా, ప్రాంక్‌ మార్షల్, పాట్రిక్‌ క్రోవెల్లీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్‌ 11, 2021న విడుద‌ల అవ్వ‌నుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: