సూపర్ స్టార్ మహేష్ తో సినిమా తీయాలంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. మహేష్ సినిమా అంటే వందలకోట్ల బిజినెస్ జరుగుతుంది. తేడా వస్తే నిర్మాత రోడ్డున పడతాడు.  అందుకే మ్యాక్సిమం క్రేజీ కాంబినేషన్, కథ బాగా నచ్చితేనే సినిమా చేస్తాడు మహేష్. దీన్ని కొందరు తప్పుపట్టిన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు మహేష్. 

 

మహేష్ తో అందరికి సినిమా చేయాలని ఉంటుంది. కాని అది జరగాలంటే మాత్రం లక్ తగలాల్సిందే. ఇక విషయంలోకి వస్తే మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు సెన్సిబుల్ డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రస్తుతం నాని వి సినిమాను డైరెక్ట్ చేసిన ఈయన మహేష్ కోసం ఒక సూపర్ స్టోరీ రాశాడట. అయితే మహేష్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాడట. సమ్మోహనంతో సుధీర్ బాబుకి హిట్ ఇచ్చిన మోహనకృష్ణ వి మూవీలో కూడా సుధీర్ ను తీసుకున్నాడు. మర్చి 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. 

 

మహేష్ కు కథ చెప్పడానికి సుధీర్ హెల్ప్ తీసుకుంటున్నారట. ఆల్రెడీ సుధీర్ బాబు కథ వినడం బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చాడట. ఇక మహేష్ ను కలిసి వినిపించడమే ఉంది. మహేష్ కనుక మోహనకృష్ణ కు ఛాన్స్ ఇస్తే మాత్రం అతని ఫేట్ మారిపోతుంది. ఇప్పటి వరకు యువ హీరోలతో సినిమాలు చేసిన మోహనకృష్ణ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు చెప్పుకుంటున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ సినిమా ప్లానింగ్ లో ఉందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: