టాలీవుడ్ యంగ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ అన్న ట్యాగ్ లైన్‌ తో ఈ సినిమాని తెరకెక్కించారు. శైలేష్ కొల‌ను అనే కొత్త కుర్రాడు ద‌ర్శకుడిగా పరిచయమవుతున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ప్రశాంతి నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా నటించిన ఈ సినిమా ఫిబ్రవ‌రి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 

ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన చిత్ర యూనిట్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిర్మాత నానిసినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఇక సినిమా రిలీజయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ద‌ర్శకుడు శైలేష్ నెరేట్ చేసిన క‌థ న‌చ్చడంతో ఈ సినిమాకు నిర్మాత‌గా మారాను... అంద‌రం క‌లిసి విశ్వక్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని తనని హీరోగా సెలెక్ట్ చేసుకున్నామని తెలిపాడు. 

 

ఇక ఈ సినిమాకి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చిందని మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల‌నే నిర్మిస్తామని నాని వెల్లడించాడు. అంతేకాదు కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్‌, కొత్త టాలెంట్‌ ఉన్న వాళ్ళను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టానని క్లారిటి ఇచ్చాడు. నా బ్యానర్ లో స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయ‌రు... అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో న‌టించ‌ను... నాకు క‌థ న‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను... అని తెలిపాడు నాని.

 

ఇక ఇంతకముందు మా బ్యాన‌ర్‌లో ప్రయోగం చేసిన ‘అ!’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈసారి మ‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. నేను ఇప్పటి వ‌ర‌కు ఏడు సార్లు సినిమా చూశాను. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు... అన్నాడు.  మరి ఇంత ధీమాగా ఉన్న నాని సినిమా రేపు రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: