అందం, అభినయం, సమయస్ఫూర్తి ఈ మూడు కలగలిపిన వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారు గ్లామర్ ఫీల్డ్ లో ఉంటే రచ్చరచ్చే. యాంకర్ శ్రీముఖి కూడా అదే కోవలోకి వస్తుంది. అందుకే ఆమె అంటే యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఇక యాంకర్లు అన్నాక గ్లామర్ ఫీల్డులో ఉన్నాక.. ఏవో రూమర్స్ వస్తూనే ఉంటాయి.

 

 

ఇప్పుడు శ్రీముఖి గురించి కూడా అలాంటి రూమర్స్ చాలా వస్తున్నాయి. దీనికితోడు ఆమె ఇటీవల ఓ సామాజిక మాధ్యమంలో తాను ప్రేమలో ఉన్నా అని చెప్పిందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ మాత్రం సందు దొరికితే మీడియా ఊరుకుంటుందా.. ఆమె ఎవరితో ప్రేమలో పడిందో విశ్లేషిస్తూ కథనాలు వండేశాయి. ఇప్పుడు శ్రీముఖి ఆ కథనాలపై స్వయంగా స్పందించింది.

 

ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తూ.. సామాజిక మాధ్యమంలో వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఇలా ఉంది.. “ ‘హాయ్‌ ఆల్‌.. ఒక విషయం చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. బీన్ ఇన్ లవ్ అంటే ఒకప్పుడు నేను లవ్‌లో ఉన్నాను. అయాం ఇన్ లవ్ అంటే ఇప్పుడు నేను లవ్‌లో ఉన్నాను అని అర్థం. ట్రూత్ ఆర్ డేర్ లాంటి గేమ్‌ ఆడి కొన్ని వీడియోలు చేసినందుకు దాని గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అవి చూసిన నా స్నేహితులు నిజంగానేనా? అంటూ అడుగుతున్నారు. రాసేవాళ్లకి న్యూస్‌ అవసరం ఉందని నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేవాళ్లు కొంచెం చూసుకుని, పూర్తి విషయం తెలుసుకుని రాస్తే అందరికీ బాగుంటుంది.

 

నేను ప్రతిరోజూ షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నాను. ప్రస్తుతానికి లవ్‌ అఫైర్స్‌ లాంటివి లేవు. నా వ్యక్తిగత జీవితం గురించి నా కంటే బాగా మీకే తెలుసు. ఒకవేళ నేను నిజంగానే ప్రేమలో డితే.. నాకంటూ ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే.. అతనితో ఒక వీడియో చేసి నేను ప్రేమలో ఉన్నానహో.. అంటూ మీకు చెబుతాను. కాబట్టి కొంచెం చూసుకోండి.. అంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చేసింది యాంకర్ శ్రీముఖి. సో.. ప్రస్తుతం శ్రీముఖి ఎవరితోనూ ప్రేమలోలేదన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: