యంగ్ హీరో నితిన్ నటించిన  భీష్మ వీక్ డేస్ లో కూడా డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాల్లో 81లక్షల షేర్ ను రాబట్టింది దాంతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను చేరుకుంది. ఇక మొత్తం ఆరు రోజుల్లో ఈసినిమా 18.50 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదల లేనందున ఫుల్ రన్ లో 30కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
 
ఓవర్సీస్ విషయానికి వస్తే  ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ కాగా  ఆరు రోజుల్లో 800k డాలర్ల వసూళ్లను రాబట్టి వన్ మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. కాగా ఈఏడాది సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో తరువాత భీష్మ రూపంలో టాలీవుడ్ కు మూడో విజయం దక్కింది. వెంకి కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో రష్మిక కథానాయికగా నటించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇక ఎట్టకేలకు మూడు పరాజయాల తరువాత  నితిన్, భీష్మ సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నితిన్..  రంగ్ దే , చెక్ సినిమాల్లో నటిస్తున్నాడు. 
 
భీష్మ 6వ రోజు వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 31 లక్షలు 
సీడెడ్ - 16 లక్షలు 
ఉత్తరాంద్ర - 17 లక్షలు 
గుంటూరు - 1.51 కోట్లు 
తూర్పు గోదావరి - 5 లక్షలు  
పశ్చిమ గోదావరి - 4 లక్షలు 
కృష్ణా - 3.1 లక్షలు  
నెల్లూరు - 2.1 లక్షలు  
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6వరోజు షేర్ = 0.80 కోట్లు
 

మరింత సమాచారం తెలుసుకోండి: