ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరి టైమ్ నడుస్తుంది. సాధారణంగా టైమ్ అనేది హీరోలు.. హీరోయిన్స్.. దర్శకులు.. కమెడియన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ సింగర్స్ హవా కూడా నడుస్తుంది. గతంలో బాలు స్వరం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ మధ్య ఉదిత్ నారాయణ్ స్వరం ఆకట్టుకుంది. ప్రస్తుతం సిద్ధ్ శ్రీరామ్. ఆయన పాడిన పాటనే తొలిపాటగా రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. పవన్.. బాలయ్య కూడా పవన్ సిద్ద్ వాయిస్ నే నమ్ముకున్నారు. 

 

చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. ఆ విలక్షణమైన వాయిస్ ను హీరోలు, దర్శకులు కోరుకుంటున్నారు. సినిమాలో ఆరు పాటలుంటే.. ముందుగా.. ఆ గాయకుడు పాడిన పాటనే రిలీజ్ చేస్తారు. ఆల్బమ్ లో ఆ సింగర్ పాటే హైలెట్ అవుతోంది. సామజవరగమన తర్వాత ఈ వాయిస్ కు డిమాండ్ పెరిగిపోయింది. 

 

మోహన్ బాబు జేసు దాస్ లా.. విజయ్ దేవరకొండకు సిద్ధ్ శ్రీరామ్ వాయిస్ సెంటిమెంట్ గా అయిపోయింది. గీత గోవిందం టీజర్ రిలీజ్ కాకుండానే.. సిద్ధ్ పాడిన ఇంకేం ఇంకేం కావాలే పాటను రిలీజ్ చేసి.. సినిమాకు హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత టాక్సీవాలా ప్రమోషన్ కూడా సిద్ధ్ శ్రీరామ్ పాటతోనే స్టార్ట్ చేశారు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా.. కడలల్లే.. సాంగ్ నే ముందుగా రిలీజ్ చేశారు. 

 

సిద్ధ్ శ్రీరామ్ పాడిన సామజవరగమన యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. స్టార్ కాస్టింగ్ లేని.. 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో సిద్ద్ ఆలపించిన సిద్ద్ ఆలపించిన నీలి నీలి ఆకాసం యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. మొత్తానికి సిద్ధ్ శ్రీరామ్ వాయిస్ యూత్ ను కట్టిపడేస్తోంది. గుండె లోతుల్ని తడుముతోంది. బాధను స్వరంతో ఓదారుస్తోంది.  పాత జ్ఞాపకాలను తట్టి లేపుతున్న ఆ గొంతుకలో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే సిద్ద్ శ్రీరామ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: