సైడ్ రోల్స్ చేస్తూ ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న వితిక షెరు యువ హీరో వరుణ్ సందేష్ ను ప్రేమించడం ఆ తర్వాత పెళ్లాడటం గురించి తెలిసిందే. ఈ ఇద్దరు అంతకుముందు ఎలా ఉన్నారో తెలియదు కాని బిగ్ బాస్ తర్వాత మాత్రం సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. హీరోగా వరుణ్ సందేష్ కెరియర్ లో వెనుకపడగా బిగ్ బాస్ లో అతని క్యారక్టర్ కు ఎక్కువ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక వరుణ్, వితిక ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌజ్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  

 

ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేసేందుకు రెడీ అంటున్న వితిక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. వరుణ్ సందేష్ కూడా మళ్లీ హీరోగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. బిగ్ బాస్ వల్ల ఇద్దరు మళ్లీ ఆడియెన్స్ కు కొత్తగా తమని తాము పరిచయం చేసుకున్నారు. బిగ్ బాస్ వల్ల పాపులారిటీ కూడా పెరిగింది. ఇక ఇలాంటి టైం లోనే ఫోటో షూట్స్ చేస్తూ ఇంకాస్త క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది వితిక.

 

అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. తనలోని యాక్టింగ్ టాలెంట్ ను గుర్తించండి అంటూ చెప్పుకొస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్కుల్లో తన 100 పర్సెంట్ ఇచ్చిన వితిక.. పర్ఫార్మెన్స్ టైం లో కూడా ఏ చిన్న పాత్ర అయినా అదరగొట్టేస్తుంది. వరుణ్ సందేష్ ఇక మీదట తన కెరియర్ మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నాడట. మరి ఈ ఇద్దరికి మళ్లీ అవకాశాలు వస్తే మాత్రం అది మంచి విషయమే అని చెప్పొచ్చు. అయితే వితిక హీరోయిన్ గానే కాదు మళ్ళీ సెకండ్ లీడ్ ఛాన్సులు వచ్చినా చేసేందుకు సిద్ధమని చెబుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: