యంగ్ హీరోలిద్దరూ బ్యాచిలర్ లైఫ్ కు బ్లాక్ బస్టర్ తో ఎండింగ్ ఇచ్చారు. బ్యాటిలర్ లైఫ్ కు బైబై చెప్పబోతున్న కుర్ర హీరోలకు మ్యారేజ్ లైఫ్ కలిసొచ్చిందంటున్నారు. మ్యారేజ్ తో న్యూ లైఫ్ లోకి అడుగుపెట్టబోతున్న యంగ్ హీరోలకు హిట్స్ మరింత కిక్ ఇస్తున్నాయి. 

 

ఇన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ హీరోలు పెళ్లి బాట పట్టారు. సింగిల్ లైఫ్ ఫెవరెర్ గా ఉండకుండా ఎంచక్కా నచ్చిన అమ్మాయితో మింగిల్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కుర్ర హీరోలిద్దరికీ పెళ్లి బాగానే కలిసి రాబోతుందనేది హిట్స్ తో సంకేతాలు ఇచ్చాయి. 

 

యంగ్ హీరో నితిన్ ఏప్రిల్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో నితిన్ యాక్ట్ చేసిన భీష్మ విడుదలైంది. తొలి ఆటకే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. వరుస ఫ్లాపులతో సతమతమైన నితిన్ కు భీష్మ సూపర్ హిట్ పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇలా పెళ్లి ఫిక్స్ కాగానే అలా సూపర్ హిట్ దక్కడం శుభ సూచకం అంటున్నారు. 

 

నితిన్ మాత్రమే కాదు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా తన ప్రేమ విషయం.. నిశ్చితార్థం విషయం వెల్లడించాడు. త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిఖిల్ లాస్ట్ సినిమా అర్జున్ సురవరం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. అయితే సినిమా పెళ్లి విషయం వెల్లడించక ముందు కాబట్టి కౌంట్ చేయలేం. అందుకే బ్యాచిలర్ లైఫ్ లో లాస్ట్ హిట్ సినిమా గా అర్జున్ సురవరంను చెప్పుకోవచ్చు. మొత్తానికి నితిన్.. అటు నిఖిల్ కు పెళ్లి బాగానే కలిసొస్తోంది. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్న ఈ ఇద్దరు హీరోలు ఫుల్ జోష్ లో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: