సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. అదృష్టం కలిసి వచ్చి... పెళ్లిచూపులు.. అర్జున్ రెడ్డి.. గీత గోవిందం హిట్ అయ్యాయి అని ఇప్పుడు కొందరు అంటున్నారు.. ఆ సినిమాలు హిట్ కావడం వల్ల విజయదేవర్ కొండ స్టార్ ఎక్కడికో పోయింది అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే విజయదేవర్ కొండ స్టార్ అలా తిరిగింది ఆ టైంలో.. అలాంటి స్టార్ ఇప్పుడు కింద పడుతుంది అని అంటున్నారు కొందరు.. 

 

అలా ఎందుకు అంటున్నారు? అలా అనడానికి కారణం ఏంటి అని మీకు సందేహం రావచ్చు.. కానీ విజయదేవర్ కొండ రెండు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.. దీంతో ఇప్పుడు వచ్చే మూడో సినిమా కూడా ప్లాప్ అవుతే విజయ్ దేవరకొండ సినీ జీవితానికి చెక్ పడచ్చు అని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. 

 

ఈ నేపథ్యంలోనే విజయ దేవరకొండ పూరి జగన్నాధ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ఎలా అయినా సరే హిట్ కొట్టాలి అనే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నాడు.. ఈ సినిమాను హిట్ చేసేందుకు పూరి జగన్నాథ్ కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట.. ఆ నిర్ణయం ఏంటంటే?

 

మాములుగా సినిమాల షూటింగ్‌ను 90 రోజుల్లోనే పూర్తి చేసే పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండ సినిమా మాత్రం నిదానం అయినా పర్లేదు హిట్ పడాలి అని అంటున్నాడట.. విజయ్ సినిమా కోసం 120 రోజులు షూటింగ్‌ కోసమే కేటాయించినట్లు సమాచారం.. అంతేకాదు తాను అనుకున్న ఔట్‌పుట్‌ కోసం చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారట పూరీ. 

 

మరోవైపు ఇస్మార్ట్ శంకర్‌తో తనకు మంచి హిట్ రావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారట పూరి జగన్నాధ్.. కాగా ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవ్వనుంది.. మరి ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: