భారతీయుడు2 ఆన్ లొకేషన్ యాక్సిడెంట్ ఎంత చర్చనీయాంశమైందో తెలిసిన విషయమే. ముగ్గరు మృతి చెంది, పది మంది క్షతగాత్రులుగా మారిన ఈ ఘటనకు సంబంధించి లైకా ప్రొడక్షన్స్ కు కమల్ ఓ బహిరంగ లెటర్ రాసాడట. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, షూటింగ్ లో పాల్గొనేవారికి బీమా, షూటింగ్ స్పాట్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే షూటింగ్ లో పాల్గొనని బహిరంగా లేఖ రాశాడట. దీంతో లైకా ప్రొడక్షన్స్ కూడా కమల్ కు దటైన జవాబిస్తూ బహిరంగ లేఖే రాసింది. దీనిని లైకా ప్రొడక్షన్స్ అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

 

‘కమల్ గారూ మీరు ఉత్తరం రాయకమునుపే బాధితులకు 2కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాము. బాధిత కుటుంబాలకు బీమా సకాలంలో అందించడంతో పాటు వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తీసుకున్నాము. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. సీనియర్లైన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లను కూడా నియమించాం. ఈ విషయాలేవీ మీ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. మీరు కోరినవన్నీ మేము ముందే పూర్తి చేశాం. లొకేషన్ లో ఉన్న మీకు అప్పటి పరిస్థితులు పూర్తిగా తెలుసు కూడా. మనం త్వరగా షూటింగ్ ప్రారంభిద్దాం’ అంటూ ప్రతిగా ఘాటు సమాధానమే ఇచ్చారు..

 

 

ప్రస్తుతం ఈ విషయం చెన్నై ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ దుర్ఘటనతో కమల్ హాసన్, శంకర్, లైకా ప్రొడక్షన్స్ తో పాటు టీమ్ అంతా స్తబ్దుగా అయిపోయిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు కమల్ కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. శంకర్ కూడా భావోద్వేగాన్ని అపుకోలేక తన బాధను వ్యక్తం చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lyca_productions) on

మరింత సమాచారం తెలుసుకోండి: