సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి భారీ అచనాలతో రిలీజైన సినిమా సరిలేరు నీకెవ్వరు. భారీ పోటీ మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల వైకుంఠరములో సినిమాతో మహేష్ బరిలోకి దిగాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ముందు మహేష్ బాబు సరిలేరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అల రికార్డ్స్ ముందు సరిలేరు సరితూగలేదు. దాంతో మహేష్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఒక వైపు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా సరిలేరుకి పెద్ద మైనస్ అయింది.

 

అయితే సూపర్ స్టార్ మాత్రం ఒక్క విషయంలో చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. అదే అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్. గత మూడు సినిమాలలో మహేష్ ఫ్యాన్స్ కి కావలసినట్టుగా ఊరమాస్ సాంగ్ లో కనిపించలేదు. ఇది మహేష్ కే కాదు ఆయన ఫ్యాన్స్ కి బాగా డిసప్పాయింట్‌మెంట్ గా ఉండింది. దాన్ని అనిల్ ఫుల్ ఫిల్ చేశాడు. సరిలేరు సినిమాలో ఒక మాస్ సాంగ్ తో మహేష్ బాగా శాటిస్‌ఫై అయ్యారు. మహేష్ ఫ్యాన్స్ కూడా అప్పుడెప్పుడో పోకిరి సినిమాలో ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి సరిలేరులో మాస్ మహేష్ బాబు ని చూశారు. దాంతో మహేష్ బాబు అనిల్ తో ఇంకో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

ఇదిలా ఉంటే మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ దిల్ రాజు వంశీ పైడిపల్లి తో చేయాల్సి ఉంది. కానీ దాదాపు ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. అందుకు కారణం ముఖ్యంగా వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో నాకు స్క్రిప్ట్ నచ్చలేదని వంశీతో నిర్మొహమాటంగా చెప్పారు. అంతేకాదు దిల్ రాజుతోను విభేదాలు వచ్చాయట. సరిలేరు థియోటర్స్ నుండి తీసేయడం ఒక కారణం అయితే వంశీ సినిమాకి దిల్ రాజు ఇస్తానన్న రెమ్యూనరేషన్ కూడా ముఖ్య కారణం. అది మహేష్ బాబుకి నచ్చకపోవడం ఇదే విషయంలో దిల్ రాజు మహేష్ బాబుకి చెప్పిన సమాధానం హర్ట్ అయ్యోలా ఉండటంతో దిల్ రాజుతో సినిమాకి నో చెప్పారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: