టాలీవుడ్ దిగ్గజం నటుడు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొదటి సినిమా అయిన పునాదిరాళ్లు నుండి మొన్నటి సైరా నరసింహారెడ్డి వరకు ఎందరో గొప్ప గొప్ప దర్శకులతో పని చేయడం జరిగింది. ముందుగా ఖైదీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి, సుప్రీం హీరోగా, ఆపై అతి పెద్ద బ్లాక్ బస్టర్ లు అందుకుంటూ ముందుకు సాగి, మెగాస్టార్ గా అత్యద్భుతమైన క్రేజ్ ని ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కెరీర్ పరంగా ఒకానొక సమయంలో సంచలన నటుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమా చేయడానికి అప్పట్లో కమిటయ్యారు. బాలీవుడ్ అందాల నాయిక ఊర్మిళా మాతోండ్కర్ హీరోయిన్ గా ఒక మంచి యాక్షన్ కథాంశంతో ప్రారంభించబడిన ఆ సినిమా, కొంత షూటింగ్ జరిగిన తరువాత అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. 

 

అయితే ముందుగా అనుకున్న విధంగా కాకుండా మధ్యలో సినిమా కథ, కథనాల విషయమై వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ ల వలన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే ఒక రకంగా అది నిజమేనని, ముందుగా అనుకున్న విధంగా కాకుండా కథ విషయమై కొద్దిపాటి సమస్యలు తలెత్తడంతో అటు వర్మ, ఇటు చిరంజీవి ఇద్దరూ కూడా సినిమాను ఆపేయటం బెటర్ అని భావించారని, లేకుంటే దానివల్ల మరింత సమస్యలు వస్తాయని దానిని పూర్తిగా వదిలేయడం జరిగిందని సమాచారం. 

 

ఇక ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే, ఆ సినిమా కోసం మెగాస్టార్, ఊర్మిళల మధ్య చత్రీకరించబడిన ఒక రొమాంటిక్ సాంగ్ ఇప్పటికీ కూడా వీడియో రూపంలో ప్రముఖ మీడియా మాధ్యమం యూట్యూబ్లో అందుబాటులో ఉండటం విశేషం. అయితే ఒకవేళ ఆ సినిమా సినిమా గనక అన్నీ అనుకున్న విధంగా పూర్తి చేసి, ఆపై రిలీజ్ అయి ఉంటే నిజంగా మెగాస్టార్, వర్మ కాంబినేషన్ లో పెద్ద సెన్సేషనల్ హిట్ అయి ఉండేదేమో అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: