టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి కూడా ఎంతో సహృదయం గల వ్యక్తి, మరియు మృదుస్వభావి అనే విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో అద్భుత విజయాలు అందుకుంటూ సుప్రీం హీరోగా ఆపై మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, తనతో పాటు నటించే ప్రతి ఒక్క నటీనటుల్ని అలానే కేతిక నిపుణుల్ని తన సొంత వ్యక్తి గా భావించి, వారిలో ఎవరైనా సమస్యల్లో ఉంటే తనకు వీలైన సాయం చేస్తూ ఎప్పుడూ అందరితో మంచిగా ఉంటూ ముందుకు సాగుతుంటారు అనేది అందరికీ తెలిసిందే. అలానే అప్పటి టాలీవుడ్ పరిశ్రమకు మొదట విలన్ పాత్రల్లో కొన్ని సినిమాల్లో నటించి తన అద్భుత నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను మెప్పించి, ఆపై హీరోగా మారారు నటప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటున్న మోహన్ బాబు, వాస్తవానికి ఎంతో మంచివారని, షూటింగ్ సమయంలో యూనిట్ లోని వారందరితో ఎంతో మమేకమయ్యే వ్యక్తి అని, అలానే తనవద్దకు సాయం కోసం వచ్చిన వారికి తన వంతుగా తప్పక సాయం అందించే గొప్ప మనసున్న వ్యక్తి అని ఎంతో మంది సినీ ప్రముఖులు అంటూ ఉంటారు. 

 

అయితే అప్పట్లో ఈ ఇద్దరి మధ్య మధ్య కొద్దిపాటి వివాదాలు జరిగాయని వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. అయితే అప్పటి వరకూ కూడా ఆ వార్తలు ప్రచారాలు గానే ఉన్నప్పటికీ, 2007వ సంవత్సరంలో 75 ఏళ్ల తెలుగు సినిమా పండగ సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. అయితే జరిగిన ఆ వేడుకలో మెగాస్టార్ ను లెజెండ్ గా, అలానే మోహన్ బాబును సెలబ్రిటీగా ప్రకటించడంపై అప్పట్లో ఆ వేడుకలో మోహన్ బాబు ధ్వజమెత్తారు. సెలబ్రిటీ అంటే ఎవరు, లెజెండ్ అంటే ఎవరు అనే దానిపై వివరణ ఇస్తూ ఒక పుస్తకం వేయండి అంటూ మోహన్ బాబు మాట్లాడటం, ఆ తర్వాత మెగాస్టార్ ఈ విషయమై మాట్లాడుతూ, ఇక్కడ అందరూ సమానమేనని అందరు నటులు ఒకటేనని, ఇంత చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని మోహన్ బాబును ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. 

 

కాగా ఈ  వివాదం వారిద్దరి మధ్య నిజంగానే కొంత అగాధాన్ని ఏర్పరచిందనేది అందరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత రాను రాను, కాలక్రమేణా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కలిసి మెలిసి మంచి స్నేహితులుగా మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపిస్తూ మాట్లాడిన ఆనందంగా ముందుకు సాగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఒకచోట ఉన్నప్పుడు కొద్దిపాటి వివాదాలు రావడం సహజమేనని, కానీ వాటిని సరిచేసుకొని ఆపై అందరూ కలిసి మంచిగా ముందుకు సాగితేనే మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని చిరంజీవి, మోహన్ బాబు చెప్తూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: