ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇండస్ట్రీలో దాసరి నారాయణ గారు లేని లోటుని భర్తీ చేస్తూ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆయనే పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. అంతేకాదు చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేకుండా ఎవరు వచ్చి తమ సినిమాకి టీజర్ ట్రైలర్ లాంచ్ చేయమన్నా కాదనకుండా నా దగ్గర టైం లేదనకుండా లాంచ్ చేసి శుభాకాంక్షలు తెలుపుతు చిత్ర యూనిట్ సక్సస్ అందుకోవాలని కాంక్షిస్తున్నారు. ఇక సమయం చూసుకొని మరీ కొన్ని సినిమాల మీద ఆ సినిమాలలో చేసిన హీరోల మీద స్పందించి చిత్ర బృందాన్ని మెచ్చుకొని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

 

మెగా ఫామిలీలో ఎంత మంది హీరోలున్నా అందరికీ మెగాస్టార్ చెప్పే మాట ఒక్కటే అందరూ కష్ఠపడి పైకి రావాలనే. ఎవరికి వాళ్ళు కృషి చేసి సక్సస్ అందుకోవాలనే సలహాలిస్తూ సూచిస్తున్నారు. అందుకే మెగా ఫ్యామిలీలో ప్రతీ హీరో మెగా ఫ్యాన్స్ కోసం, ప్రేక్షకుల కోసం డాన్స్ విషయంలో ఫైట్స్ విషయంలో ఎంతో రిస్క్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా అది అదంతా మీకోసమే కదా ..మిమ్మలిని మెప్పించడం కోసమే అంటూ సంతోషంగా చెబుతుంటారు. ఇక చిరంజీవి గారు బయట ఎంత హుందాగా కనిపిస్తారో అంత సింపుల్ గానూ కనిపిస్తూ అభిమానులని పలకరిస్తూ అక్కున చేర్చుకుంటుంటారు. 

 

అందుకే కొన్ని కోట్ల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికి ఇన్స్పైరింగ్ పర్సన్ గా ఉన్న మెగాస్టార్ ఇప్పటికీ అమ్మ ఒడిలో తలపెట్టి హాయిగా కాసేపు చిన్నపిల్లాడిలా కనిపిస్తారంటే అమ్మ మీద ప్రేమ మమకారం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ కి అమ్మ ఎంత సెంటిమెంటో ఆయన నమ్మే ఆంజనేయ స్వామీ అంతే సెంటిమెంట్. ఆయన జీవితంలో అందరికంటే ముందు ఒక పేజీ ఉంటుందంటే అది ఆయన తల్లి గారు అంజనాదేవి గురించి, ఆ తర్వాత ఆయన దైవం ఆంజనేయ స్వామీ గురించే. క్రమం తప్పకుండా ఈ ఇద్దరిని పూజించడం మెగాస్టార్ కి ఉన్న దిన చర్యలో ప్రత్యేకతలు. అందుకే మెగాస్టార్ అంజనీపుత్రుడయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: