యువరత్న నందమూరి బాలకృష్ణ, తాతమ్మకల అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటరత్న శ్రీ ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, అక్బర్ సలీం అనార్కలి తదితర సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించిన బాలకృష్ణ, ఆపై మెల్లగా ఒక్కొక్కటిగా హీరోగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని, వాటిని విజయాలుగా మలుచుకుంటూ అప్పటి స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. క్లాస్ తో పాటు మాస్ తరహా సినిమా చేయటంలో కూడా ఎంతో పేరు గడించిన బాలయ్య, మధ్యలో భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి జానపద సినిమాలు కూడా చేశారు. 

 

ఇక ఒకానొక సమయంలో తొలిసారిగా నర్తనశాల అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు కథా కథనాలు సిద్ధం చేసుకున్న బాలయ్య, ఆ సినిమాలో ద్రౌపది గా దివంగత దిగ్గజ నటి సౌందర్య ని ఎంపిక చేయటం జరిగింది. బాలయ్య రాముడిగా ప్రారంభం అయిన ఆ సినిమా షూటింగ్ కొంతవరకు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత హఠాత్తుగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో, నటి సౌందర్య మరణించటంతో ఆ సినిమా ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

అయితే ఆ సినిమా ఆగిపోవడానికి కేవలం ఆమె మరణం మాత్రమే కారణం కాదని, సినిమాలోని కథ కథనాల విషయంలో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా సరి చేసుకుని ఆపై సినిమాని చేద్దామని భావించిన బాలయ్యకు, కొద్ది రోజులు గడిచిన తరువాత తన తండ్రి చేసిన నర్తనశాల వంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తెరకెక్కించకుండా ఉంటేనే మేలని భావించి, ఆయన దానిని పూర్తిగా పక్కన పెట్టేశారని వినికిడి. అయితే కథా, కథనాల విషయమై బాలయ్య సంతృప్తికరంగా లేకపోవడం కూడా ఆ సినిమా ఆగిపోవడానికి కొంతవరకు కారణమేనని ఆ తర్వాత మరికొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: