టాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాక అటు హిందీ, తమిళం, కన్నడ వంటి పలు ఇతర భాషల్లో కూడా పలురకాల విభిన్నమైన పాత్రల్లో నటించి నటుడిగా తనకంటూ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. అయితే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే అలవాటున్న ప్రకాష్ రాజ్, ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాలో తొలుత ప్రధాన విలన్ గా నటించాల్సి ఉంది. నిజానికి ముందుగా ప్రకాష్ రాజ్ ని మెయిన్ విలన్ గా ఎంపిక చేసిన యూనిట్, ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం కూడా జరిగిందట. 

 

అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, దర్శకుడు శ్రీను వైట్లకు నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య కొద్దిపాటి విభేదాలు తలెత్తడంతో, ప్రకాష్ రాజ్ ను ఆ సినిమా నుండి తప్పించి, ఆ వెంటనే ఆయన స్థానంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ ని తీసుకోవటం జరిగింది. అయితే ఆ తర్వాత ఆగడులో తనను తీసివేసి ఆ స్థానంలో మరొక నటునితో తీసుకోవడంపై ప్రకాష్ రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల పై మీడియా ముఖంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. 

 

మరోవైపు శ్రీను వైట్ల మాట్లాడుతూ, తమ సినిమాకు నచ్చిన నటులను ఎంపిక చేసుకునే హక్కు తమకు ఉందని, తాను ఎవరితోనూ సినిమా విషయమై విబేధించలేదని మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో చెప్పారు. దాదాపుగా కొద్దిరోజులపాటు ప్రకాష్ రాజ్ కు శ్రీనువైట్ల కు మధ్య జరిగిన ఆ గొడవ, ఆ తర్వాత మెల్లగా సద్దుమణిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది....!!
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: