దక్షిణ భారతదేశంలో ఉన్న సూపర్ స్టార్స్ లో రజినీకాంత్, కమల్ హాసన్ తమిళ సినీ పరిశ్రమను ఏళ్లుగా ఏలేశారు. జనరేషన్స్ మారినా తమిళ సినీ పరిశ్రమలో లెజెండ్స్ గా ఉన్నారు. ఇద్దరూ తమిళ దిగ్దర్శకుడు కె బాలచందర్ శిష్యులే. తమిళ్ లో పోటాపోటీగా నటించిన వీరిద్దరూ కలిసి అప్పట్లో కొన్ని సినిమాలు కూడా చేశారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించి ఇప్పటికి 35ఏళ్లు పూర్తయింది. 1985లో హిందీలో వచ్చిన గిరఫ్తార్ సినిమాలో ఆఖరుసారిగా కలిసి నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు పనిచేయనున్నారు.

 

 

అయితే.. ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా మాత్రం కాదు. కమల్ హాసన్ నిర్మాతగా తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజినీకాంత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తవుతున్నాయని చెన్నై సినీ వర్గాల సమాచారం. ఇటివల రజినీకాంత్, కమల్ హాసన్ రాజకీయంగా కూడా అడుగులు వేస్తున్నారు. కమల్ స్థాపించిన రాజకీయ పార్టీతో పాటు కలిసి పనిచేసే అవకాశాలున్నాయని రజినీ స్పష్టం చేశాడు కూడా. ఆ సమయంలోనే రజినీకాంత్ తో సినిమా చేస్తానని కమల్ కూడా ప్రకటించాడు. ఇప్పుడీ ప్రకటన కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

 

వచ్చే మార్చి 5న ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభవుతుందని అంటున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి సినిమా చేస్తే ఎంత క్రేజ్ ఉంటుందో ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు పోటాపోటీగా నటించిన వీరిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఇప్పుడు వీరిద్దరి ఫ్యాన్స్ కు ఈ న్యూస్ పండగే. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా మరెన్ని సంచలనాలు నమోదు చేయనుందో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: