మెగా హీరో రామ్ చరణ్ తమ ఫ్యామిలీ గురించి బయట పుకార్లు చేసేవాళ్లు తమకు వెంట్రుకతో సమానం అంటూ ఆ మధ్యన ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎవరెన్నీ అనుకున్నా.. తమ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుందని చెర్రీతో పాటు మెగా హీరోలు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కలిసి ఫోజు ఇచ్చిన ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. 

 

 

అయితే ఫ్యామిలీ రిలేషన్‌ను పక్కనపెడితే.. సినిమాల విషయంలో మెగా హీరోలపై చెర్రీ అభిప్రాయమేంటన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.ఇక అసలు విషయంలోకి వస్తే.. కొరటాల దర్శకత్వంలో చిరు నటిస్తోన్న 152వ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతము ఆ సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉంది. 

 

 

 ఇక ఇప్పుడు ఆ పాత్రలో మహేష్‌బాబు నటించనున్నారని.. దానికి సంబంధించి 30రోజుల డేట్లు కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే చిరు సినిమాలో ఓ చిన్న పాత్రలోనైనా నటించేందుకు మెగా హీరోలందరూ ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్  నటించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో ఎవరు కీలక పాత్రలో అన్న విషయం తెలియాల్సి ఉంది . 

 

 


అయితే చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ కారణమున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ అదనపు ఆకర్షణ అవ్వడంతో పాటు.. ఇరు ఫ్యాన్స్‌ల మధ్య సయోధ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా తామంతా ఒకేటనని ప్రేక్షకులకు చెప్పొచ్చు. అలాగే మార్కెట్ పరంగానూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచించిన చెర్రీ.. మహేష్‌‌వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక కొరటాలకు మహేష్‌తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో.. ఇందులో నటించేందుకు సూపర్‌స్టార్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా చిరు సినిమాలో మహేష్ బాబు రావడం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: