సినిమారంగంలో ఎత్తులు పై ఎత్తులు ఆధిపత్య పోరాటాలు అభిమానుల మధ్య యుద్ధాలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ లో గత మూడు దశాబ్దాలుగా చాలా మంది అగ్ర హీరోలు పైకి నవ్వుతూ పలకరించు అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నా.. లోపల మాత్రం వారి మధ్య కోల్డ్‌వార్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు కూడా కొంత మంది మధ్య నడుస్తూనే ఉంది. ఎందుకు అంటే టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల విషయంలో సైతం ఆ ఇద్దరు అగ్ర హీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ప్రచారం జోరుగా వినిపించింది.

 

 ఇక టాలీవుడ్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కు మరో హీరోకి మధ్య ఒక హీరోయిన్ విషయంలో ఏర్పడిన విభేదాలు అప్పట్లో పెద్ద రచ్చ రచ్చగా మారాయన్న టాక్ ఉంది. ఒక హీరోయిన్ ఒకేసారి ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో నటిస్తుండటంతో ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చు వల్ల ఈ ఇద్దరు హీరోల మధ్య పెద్ద అగాథం ఏర్పడిందట. ఈ హీరోయిన్ పెట్టిన చిచ్చు వల్ల బాలయ్య ఆ హీరోకు ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడంతో తీవ్రంగా హర్ట్ అయిన హీరో అప్పటి నుంచి పదే పదే బాలకృష్ణ సినిమాలు తన సినిమాలు రిలీజ్ అయ్యేలా చేసుకుని బాలకృష్ణ సినిమాల పై తన సినిమాలు పై చేయి సాధించేలా ప్లాన్ చేశాడని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

 

 బాలయ్య సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసిన ప్రతిసారి సదరు హీరో కూడా తన సినిమాను పోటీకి దింపడం తో బాలయ్య పై ఆ హీరోకు ఉన్న కోపం ఇలా బయట పడిందని అప్పట్లో అందరూ చర్చించుకునే వాళ్ళు. అలా నాలుగైదు సార్లు ఆ హీరో బాలయ్య సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయించాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం బాగా పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: