టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా ఉవ్వెత్తిన ఎగ‌సిన కెర‌టంలా వ‌చ్చాడు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌. త‌న‌దైన స్టైల్‌తో పాటు మేన‌రిజ‌మ్‌తో తొలి సినిమాతో ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డ్డ విశ్వ‌క్ సేన్ యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేశాడు. ఫ‌ల‌క్‌నామా దాస్ అంతా వివాదాల‌తోనే బాగా హైలెట్ అవ్వ‌డంతో పాటు విశ్వ‌క్‌సేన్‌కు మంచి పేరు కూడా తీసుకు వ‌చ్చింది. తాజాగా క్రేజీ హీరో విశ్వక్ సేన్ హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా నూతన దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్”. ఈ సినిమాను నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌డంతో పాటు తెర‌వెన‌క అంతా తానై వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు భారీ అంచ‌నాలు ఉన్నాయి.



ఇటీవ‌ల టాలీవుడ్‌లో థ్రిల్లింగ్ జాన‌ర్ సినిమాల‌కు క్రేజ్ ఉంది.  ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా స‌రికొత్త‌గా నిర్వ‌హించారు. స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి ప్రేక్షకుల్నీ థీయేటర్‌కు రప్పించే కొత్త పంథాలో ఈ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించారు. థ్రిల్లింగ్ జాన‌ర్ లో మరో సరికొత్త సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మాంచి అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి విశ్వక్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఉందనే చెప్పాలి.



సినిమా స్టార్టింగ్ నుంచి మంచి హైప్‌తో స్టార్ట్ అయ్యిందంటున్నారు. తొలి సీన్ నుంచి ఆసక్తికర సన్నివేశాలతో మొదలయ్యి ఇంటర్వెల్ వరకు ఎక్కడా తగ్గకుండా నడుస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే పీక్స్ లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగా దర్శకుడు అందించిన స్క్రీన్ ప్లే అదిరిపోయింద‌ని అంటున్నారు. సినిమా అంతా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో న‌డ‌వ‌డంతో సినిమాను బిగి స‌డ‌ల‌కుండా ఆస‌క్తిగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడ‌నే అంటున్నారు.



ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే ట్విస్ట్ అదిరిపోయిందంటున్నారు. ఈ ట్విస్ట్‌తో సెకండాఫ్ పై మరింత అంచనాలు ఏర్పర్చాయి.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ? ఇప్పుడు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: