టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విశ్వ‌క్ సేన్ హీరోగా - నాని నిర్మాత‌గా తెర‌కెక్కిన సినిమా హిట్‌. రిలీజ్‌కు ముందే డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్లు చేయ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. విశ్వక్ సేన్ ఈ సినిమాలో విక్రమ్ రుద్రరాజు అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘హిట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిప్రాయాలు కూడా వెల్ల‌డిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో త‌మ రివ్యూలు, రేటింగులు కూడా షేర్ చేస్తున్నారు.



ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల టాక్ ప్ర‌కారం చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా ఫస్టాఫ్ చాలా బాగుందని అంటున్నారు. ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ శైలేష్  కొత్త వాడైనా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడని టాక్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో పాటు సినిమా అంతా చాలా ఎంగేజింగ్‌గా ఉంద‌ని టాక్‌. సినిమాలో ఉన్న ఉత్కంఠ‌ను సినిమా అంతా కంటిన్యూ చేయ‌డంతో పాటు సినిమాలో సస్పెన్స్ క్లైమాక్స్ వరకు కొనసాగిస్తూ.. కథ ఎడ్జ్ ఆఫ్ థ్రిల్లర్‌గా ఉందని.. ప్రధాన పాత్రలో నటించిన విశ్వక్‌సేన్ ఇరగదీశాడని టాక్.



ఇక ఓవ‌రాల్ టాక్ ప్ర‌కారం చూసుకున్న‌ట్ల‌యితే సినిమా హిట్ అనే ఎక్కువ మంది అంటున్నారు. ఈ సినిమాను యూత్ &  కాలేజ్ టార్గెట్ గా తీయ‌డంతో వాళ్ల‌కు మాత్రం పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేస్తుంద‌ని.. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తార‌ని అంటున్నారు. ఏదేమైనా విశ్వక్ మరియు శైలేష్ కాంబో లో నమోదైన మొదటి కేసు “హిట్” ట్రాక్ లోనే ఉందని చెప్పాలి. సినిమాకు స్క్రీన్ ప్లే, సూప‌ర్బ్ నేప‌థ్య సంగీతం, క‌థ‌ను ఇన్వెస్ట్‌గేష‌న్ చేసిన తీరు.. క‌థానుసారం వ‌చ్చే ట్విస్టులు హైలెట్‌గా ఉన్నాయ‌ని అంటున్నారు.



అయితే సినిమా అంతా బాగున్నా ప్ర‌ధానంగా క‌మ‌ర్షియాల్టీ మిస్ అవ్వ‌డం తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత వ‌ర‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తుంది ?  క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా స్టామినా ఏంటి అనేది మాత్రం రెండు, మూడు రోజులు ఆగితే గాని తెలియ‌దు.  ఓవరాల్ గా మాత్రం విశ్వక్, శైలేష్ నిర్మాత నాని క‌ల‌సి హిట్ కొట్టార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: