మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్‌. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎంతో మందిలో డ్యాన్స్‌ పట్ల ప్రేమను కలిగించి మెగా ఇమేజ్‌. అందుకే ఆయన జర్నీ ఎంతో మంది ఇన్సిపిరేషన్‌. తెలుగు సినిమాను కమర్షియల్‌గా ఎంతో ఎత్తుకు చేర్చిన చిరు ఒక దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హీరోగా వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో చిరు మార్కట్, ఇమేజ్‌ మీద కూడా అనుమానాలు వచ్చాయి.


ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చెన్నైలోనే ఉండేది. ఎన్టీఆర్‌, ఏఎన్నారు హీరోలుగా ఓ రేంజ్‌లో ఉన్న సమయంలో హీరోలు హీరోయిన్లతో పాటు సాంకేతిక నిపుణులు అంతా చెన్నైలోనే ఉండేవారు. చిరు కూడా ఇండస్ట్రీలో చెన్నైలో ఉండగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడే ఎదిగారు. అక్కడ ఉండగానే మెగాస్టార్‌ అయ్యారు. అయితే కొంతకాలానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల చొరవతో ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలి వచ్చింది. అయిన చిరు మాత్రం చెన్నైలోనే ఉన్నాడు. పిల్లల చదువులు, ఆస్తుల కారణంగా మెగా ఫ్యామిలీ అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో ఇండస్ట్రీ అంతా హైదరాబాద్‌ వచ్చేసిన చిరు మాత్రం అక్కడే ఉండిపోయాడు.

 

తరువాత కాలంలో హైదరాబాద్‌లో స్టూడియోలు అభివృద్ధి చెందటంతో షూటింగ్‌లో ఎక్కువగా హైదరాబాద్‌లోనే చేయటం ప్రారంభమైంది. దీంతో చిరు కూడా మకాం హైదరాబాద్‌కు మార్చక తప్పలేదు. అయితే చిరు హైదరాబాద్‌ మకాం మార్చిన తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదరయ్యాయి. సూపర్‌ హిట్ అవుతాయనుకున్న సినిమాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ కావటంతో చిరు ఇమేజ్‌ ఇబ్బందుల్లో పడింది. దీంతో హైదరాబాద్‌ తనకు కలిసి రాలేదంటూ తిరిగి చెన్నై వెళ్లిపోయాడు మెగాస్టార్‌. ఆ తరువాత చాలా కాలానికి సొంత ఇంటిని నిర్మించుకొని తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: