విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ లో వచ్చిన సినిమా హిట్. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శైలేష్ డైరెక్ట్ చేశారు. సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ప్రకారం నాని హిట్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఇద్దరు ఆడవాళ్ల మిస్సింగ్ కేసులను ఎలా కనిపెట్టాడు. క్లూస్ తో రౌడీలను ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా కథ.

 

క్రైం థ్రిల్లర్ కథతో వచ్చిన హిట్ సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయని టాక్ వస్తుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్ కు తగినట్టుగా ఇచ్చాడని అంటున్నారు. నిర్మాతగా నాని సరైన టైం లో సరైన సబ్జెక్ట్ తో వచ్చాడని చెప్పొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కు హిట్ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అయితె ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉందని అంటున్నారు.

 

శైలేష్ కథ, కథాలు సినిమాకు బాగా సెట్ అయ్యాయని తెలుస్తుంది. రెండు సినిమాల అనుభవమే అయినా విశ్వక్ సేన్ తన నటనతో మెప్పించాడని తెలుస్తుంది. రుహాని శర్మ కూడా తన పాత్రలో ఆమె ఇంప్రెస్ చేసింది. నాని ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క నిర్మాతగా సినిమాలు చేయడం విశేషం. తన మనసుకి నచ్చి కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది అనుకున్న సబ్జెక్ట్ వస్తే నాని నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు. విశ్వక్ సేన్ కెరియర్ లో హిట్ తప్పకుండా మంచి ఫలితాన్ని ఇచ్చిన సినిమాగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే కమర్షియల్ అంశాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా నిరాశ పరచే అవకాశం ఉందని చెప్పొచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: