నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా విశ్వ‌క్ సేన్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ శైలేష్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సినిమా హిట్‌. రిలీజ్ ముందే డిఫరెంట్ ప్రమోషన్ల తో అందరినీ ఆకట్టుకున్న హిట్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకోవడంతో సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వచ్చింది. ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడే ఓ క్రైమ్ ఆఫీసర్.అయితే అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయి రుహాని శర్మ మిస్సయిపోతుంది.అలాగే మరోపక్క ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది.



ఈ రెండిటిని ఛాలెంజింగ్ తీసుకున్న హీరో ఏం చేశాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాలో చాలా ప్ల‌స్‌లు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ శైలేష్ తొలి సినిమా అయినా చాలా ఎంగేజింగ్ గా సినిమాను తెర‌కెక్కించాడు. స్క్రీన్ ప్లే తో మాయ చేయ‌డంతో పాటు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో తెర‌కు అతుక్క‌పోయేలా చేయ‌డంతో పాటు సీట్ల‌లో నుంచి ఎంతో ఉత్కంఠ‌తో తెర వైపు నుంచి చూపులు తిప్ప‌కుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక సినిమాకు నేప‌థ్య సంగీతం కూడా ప్ల‌స్ అయ్యింది. ప్ర‌తి సీన్‌ను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది. ఇక విశ్వ‌క్ సేన్ న‌టన యూత్‌కు, కుర్ర‌కారుకు మాత్రం పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేస్తుంది.



ఇక నాని నిర్మాణ విలువ‌ల‌తో పాటు సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగుంది. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు సీరియ‌స్‌గా న‌డుస్తుంది. అయితే ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు క‌నెక్ట్ చేసుకుంటారా ? అన్న‌ది డౌటే. ఇక కామెడీ త‌క్కువుగా ఉండ‌డం ఒక మైన‌స్ అయితే.. సినిమాకు కీల‌క‌మైన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా ఉండ‌డం కూడా చిన్న మైన‌స్సే అనాలి. అయితే టార్గెటెడ్ ఆడియెన్స్ కోసం వ‌చ్చిన ఈ సినిమా ఆ వ‌ర్గాల‌ను పూర్తిగా సంతృప్తి ప‌రుస్తుంది. హీరోగా విశ్వ‌క్ సేన్‌కు కూడా మంచి పేరు తీసుకు వ‌స్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: