‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ లాంచింగ్ సమయంలో రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తన సినిమాలో చరణ్ జూనియర్ ల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు సృష్టించ లేదనీ అందువల్ల వీరిద్దరి పాత్రలకు సంబంధించి సమతూకంలో తేడాలు ఉండవచ్చు అంటూ ముందుగానే వారి అభిమానులకు లీకులు ఇచ్చాడు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న చరణ్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ను భయంకరంగా చితకబాదే సీన్ ఈమధ్య రాజమౌళి చిత్రీకరించాడట.


ఈ సీన్ చూసే వారికి చరణ్ జూనియర్ పై ప్రవర్తించే తీరుకు ఆ క్షణంలో కోపం వచ్చేలా అత్యంత సహజంగా చిత్రీకరించాడట రాజమౌళి. ఈ సీన్ ను చిత్రీకరిస్తున్నప్పుడు షూటింగ్ లో పాల్గొన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ ద్వారా ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అయింది. వాస్తవానికి వెండితెర పై చరణ్ జూనియర్ ను చితక బాదే సీన్ ను తీయాలి అంటే చాల సాహసం చేయాలి. 


అయితే రాజమౌళి సినిమా కథలో పాత్రలు కనిపిస్తాయి కాని ఆ పాత్రలలో కనిపించే నటీ నటుల గురించి సగటు ప్రేక్షకులు పట్టించుకోరు కాబట్టి రాజమౌళి ఇలాంటి ప్రయోగం చేసాడు అని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉండే తారక్ అభిమానులు రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఎంత వరకు హర్షిస్తారు అన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు లీక్ అయిన ఈ వార్త గురించి ఈ మూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కోబోతున్న బయ్యర్లను కూడ కలవర పెడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్న రామ్ చరణ్ పోలీసు గెటప్ లో కనిపిస్తున్నట్లుగా లీక్ అయిన ఒక ఫోటోను చూసిన వారు మాత్రం సీతారామరాజు పోలీసుగా మారడం ఏమిటి అంటూ ఆశ్చర్య పోతు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న క్రియేషన్ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తోంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: