ఒక్కొక్కరికి ఒక్కోదానిపై ప్రేమ ఉంటుంది.  భర్తలకు భార్య అంటే సహజంగా ప్రేమ ఉంటుంది.  ఆ ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపుతుంటారు.  ప్రేమను చూపించే విధానం మీద ఆధారపడి వారి సంబంధాలు ఉంటాయి.  కొందరు భర్తలు భార్యలపై  చూపించే చాలా గొప్పగా ఉంటుంది.  అలాంటి ప్రేమను మరెక్కడా చూడలేము.  ఇలాంటి ప్రేమను పంచె భర్త లభిస్తే ఆ భార్య అదృష్టవంతురాలే.  


ఇలాంటి అదృష్టమే నటి హెడి లామర్ కు కలిగింది.  హెడి లామర్ హాలీవుడ్ నటి.  1933 లో ఆమె ఎక్స్ టసి అనే సినిమా చేసింది.  ఈ సినిమాలో ఆమె చేసిన రోల్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.  సినిమాలో దాదాపుగా నగ్నంగా నటించింది అని చెప్పాలి.  ఈ సినిమా చూసిన ఎవరైనా సరే ఆమె హెడి లామర్ కాదు హెడి గ్లామర్ అనేస్తారు.  సినిమా షూటింగ్ సమయంలో అత్యంత సంపన్నుడైన మండస్ అనే వ్యక్తి ఆమెను కలిసాడు.  


ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు.  ప్రేమను ఆస్వాదించారు .  ఆమె లేకుంటే తానూ లేను అన్నట్టుగా ప్రేమించాడు.  ఆమెను వివాహం చేసుకున్నాడు.  వివాహంతో పాటుగా మండస్ మరోపని కూడా చేశాడు.  భార్య శరీరాన్ని ఎవరూ కూడా చూడకూడదు అని చెప్పి ఎక్స్ టసి ప్రింట్ లను కొనేశారు.  ఆ ప్రింట్ లను తగులబెట్టాడు.  ల్యాబ్ నుంచి వచ్చే ప్రింటులను కొనుగోలు చేయడం వాటిని తగలబెట్టడం అదే పనిగా పెట్టుకున్నాడు.  


భార్యపై ఎంతటి ప్రేమ ఉన్నా మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా చెప్పండి.  కేవలం అయన సినిమా ప్రింట్ల కోసమే తన ఆస్తిలోని చాలాభాగం ఖర్చు చేశారు.  డబ్బు  దండిగా ఉన్నది కాబట్టి చేయగలిగారు.  మిగతా వాళ్ళైతే చేయగలిగేవారా? అసలు హీరోయిన్ను పెళ్లి చేసుకోగలిగేవారా చెప్పండి.  ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఇంట ప్రేమగా చూసుకుంటారా? ఇప్పుడు టాలీవడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: