సినీ జనాల మీద ఏదైనా చిన్న వార్త వస్తే చాలు మీడియా చేసే ప్రచారం అందరికి తెలిసిందే. అనవసర ప్రచారాలు అన్నీ చేస్తూ... వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వేలు పెడుతూ ఉంటుంది. వాళ్ళ తిండి నుంచి వాళ్ళ మల విసర్జన వరకు అన్నీ మీడియాకు కావాలి. ప్రతీ ప్రచారం కూడా వాళ్ళు కనీసం బాధ పడతారు అనేది కూడా లేకుండా చేస్తూ ఉంటుంది మీడియా. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రోత ప్రచార౦ మరింత ఎక్కువైంది అనేది మాత్రం అక్షరాలా నిజం. ప్రతీ చిన్న వార్తను కూడా పెద్దగా రాస్తూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. 

 

సోషల్ మీడియా లో అయితే మరీ దారుణంగా తయారు అయ్యారు. పచ్చని కాపురాలను ప్రచారంతో కూల్చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు కొందరు సైకోలు. ఈ నేపధ్యంలోనే, మెగా హీరో ఒకరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ని వివాహం చేసుకున్న ఆ మెగా హీరో కి ఆమెకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే వీళ్ళు విడిపోతున్నారు అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు సోషల్ మీడియా లో ఎక్కువగా పోస్ట్ లు పెడుతూ సందడి చేస్తున్నారు. 

 

వాళ్ళ మధ్య విభేదాలు రావడంతో కుటుంబ పెద్దలు కూడా జోక్యం చేసుకుని వాళ్లకు సర్ది చెప్పారని, గత రెండేళ్ళ నుంచి ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుందని, అయినా సరే వాళ్ళు మాత్రం వినడం లేదని, విడిపోవడానికి రెడీ అయ్యారని, త్వరలోనే వాళ్ళు విడిపోవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఇక టాలీవుడ్ జనాలు కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఆ కుటుంబానికి ఉండే సన్నిహితుల ద్వారా వాళ్ళు కలిసి ఉంటున్నారా లేదా విడిపోతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: